సంక్రాంతికి బీఎస్ 6 ప్రమాణాలతో ఆడీ క్యూ 8 ఆవిష్కరణ

న్యూడిల్లీ: ఏడాది జనవరి 15వ తేదీన జర్మనీ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ తన వాహన శ్రేణిలో ఎస్‌యూవీ క్యూ8 మోడల్ కారును విడుదల చేయనున్నట్లు తెలిపింది. 2025నాటికి దేశంలో తన వాహన విక్రయాలను మరింత బలోపేతం చేసుకునే నేపథ్యంలో భాగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆర్డర్లను ఆడి ప్రారంభించింది. దీంతో వారాంతానికి లగ్జరీ వాహనాల విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. 

bs 6 engine audi car will launch in sankrathi season

న్యూడిల్లీ: జర్మనీ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ తన వాహన శ్రేణిలో ఎస్‌యూవీ క్యూ8 మోడల్ కారును వచ్చే ఏడాది జనవరి 15వ తేదీన భారత్‌ విపణిలోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది. 2025నాటికి దేశంలో తన వాహన విక్రయాలను మరింత బలోపేతం చేసుకునే నేపథ్యంలో భాగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆర్డర్లను ఆడి ప్రారంభించింది. దీంతో వారాంతానికి లగ్జరీ వాహనాల విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. 

aslo read  మార్కెట్‌లోకి యమహా బీఎస్-6 బైక్‌లు.. ధర ఎంతంటే!

‘2025లక్ష్యం’గా మేం ముందుకు సాగుతున్నాం. ఇందులో క్యూ8 కీలక పాత్ర పోషించనున్నది. దీంతో పాటు సీ, డీ సెగ్మంట్లను కూడా ముందుకు తీసుకెళ్తాం. డీ-విభాగం నుంచి మా ఉత్పత్తులు ఎక్కువగా వస్తాయి. న్యూ ఆడి క్యూ8 మోడల్ కారును జనవరిలో విపణిలోకి తీసుకొస్తాం. ఇది బీఎస్‌-6 ప్రమాణాలతో రానున్నది’’ అని ఆడి ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ థిల్లాన్‌ తెలిపారు. 

కస్టమర్ల ప్రయోజనాలే ప్రధానంగా తాము ముందుకు వెలుతున్నామని బల్బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. నాలుగు డోర్ల లగ్జరీ కారు.. ఎస్ యూవీ లార్జీ కారును పోలి ఉంటుంది. భారతదేశంలో పెట్రోల్ వినియోగ కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఆడీ క్యూ8 మోడల్ కారు 3.0 లీటర్ల టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 340 బీహెచ్పీ సామర్థ్యం కలిగి ఉంటుంది. 8-స్పీడ్ టిప్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, ఆడీ క్వాట్ట్రో ఏడబ్ల్యూడీ సిస్టమ్ కలిగి ఉంది. 

aslo read  ‘కంపాస్’ సెలబ్రిటీస్ జాబితాలో హరికేన్ కపిల్ దేవ్

సిగ్నేచర్ లార్జి సింగిల్ ఫ్రేమ్ గ్రిల్‌తోపాటు క్రోమ్ హైలైట్స్ కలిగి ఉంటుందీ కారు. పలు రకాల ఎస్ యూవీలు కూడా హెచ్డీ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ టెక్నాలజీతో స్లీక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ అమర్చారు. డే టైం రన్నింగ్ ల్యాంప్స్ పై 3డీ ఎఫెక్ట్ ఉంటుంది. 

బీఫ్లీ స్కిడ్ ప్లేట్, లార్జ్ ఎయిర్ ఇన్‌టేక్స్, స్లాపింగ్ బాయ్‌నెట్ ఫీచర్‌తోపాటు స్లోపింగ్ రూఫ్ లైన్ కలిగి ఉంటుంది. ఇన్‌క్లైండ్ డీ- పిల్లర్, 22 అంగుళాల వీల్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, విత్ ఎ డిజిటల్ క్యారక్టర్, వైడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ కలిగి ఉంటుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios