Asianet News TeluguAsianet News Telugu

Bounce Infinity E1:బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. ఏప్రిల్ 18 నుండి డెలివరీలు..

బౌన్స్ ఇన్ఫినిటీ భివాడి ప్లాంట్ లో 200 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం సంవత్సరానికి 2 లక్షల స్కూటర్ల ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. ఈ సదుపాయం 'నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్'గా పనిచేస్తుందని ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారి తెలిపారు

Bounce Infinity E1: Production of Bounce Infinity E1 begins deliveries will start from April 18
Author
hyderabad, First Published Apr 8, 2022, 6:20 PM IST

ఎలక్ట్రిక్ వాహనల్ స్టార్టప్ బౌన్స్ ఇన్ఫినిటీ రాజస్థాన్‌లోని భివాడిలో ఉన్న తయారీ ప్లాంట్‌లో కొత్త ఇన్ఫినిటీ ఈ‌1 (Infinity E1)ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఒకినావాతో సహా భివాడిలో ఇతర ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్లు ఉన్నాయి. కంపెనీ ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను ప్రకటించింది. ఇప్పుడు దీని డెలివరీలు ఏప్రిల్ 18 నుండి ప్రారంభం కానుంది. 

ఈ సందర్భంగా బౌన్స్ ఇన్ఫినిటీ సహ వ్యవస్థాపకుడు & సి‌ఈ‌ఓ వివేకానంద హలేక్రే మాట్లాడుతూ, “మా ప్లాంట్ నుండి బౌన్స్ ఇన్ఫినిటీ ఈ‌1 విడుదల చేయడంతో పాటు మా మొదటి బ్యాచ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. భారతదేశంలో   ఫ్యూచర్ మొబిలిటీ గురించి మేము సంతోషిస్తున్నాము ఇంకా ఇందులో భాగమైనందుకు గర్విస్తున్నాము." అన్నీ అన్నారు.

బౌన్స్ ఇన్ఫినిటీ భివాడి ప్లాంట్ లో 200 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం సంవత్సరానికి 2 లక్షల స్కూటర్ల ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. ఈ సదుపాయం 'నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్'గా పనిచేస్తుందని ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారి తెలిపారు. అదనంగా, కంపెనీ దక్షిణ భారతదేశంలో 500,000 స్కూటర్ల వార్షిక సామర్థ్యంతో మరో ఉత్పత్తి కర్మాగారాన్ని నిర్మించాలని కూడా యోచిస్తోంది. 

బౌన్స్ ఇన్ఫినిటీ నుండి కొత్త ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ దేశంలోనే బ్యాటరీతో నడిచే ఏకైక ఉత్పత్తి, ఇంకా స్వాపబుల్  బ్యాటరీ డ్యూయల్ ఆప్షన్‌తో  వస్తుంది - బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS)తో కూడిన స్కూటర్ ఇంకా బ్యాటరీ విత్ ఛార్జర్‌తో కూడిన స్కూటర్. ఈ 'BaaS' ఆప్షన్ స్కూటర్  మొత్తం ధరను గణనీయంగా తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది. అంటే ఈ స్కూటర్ ధర 40 శాతం వరకు తగ్గుతుంది.

బౌన్స్ ఈ1 ఇ-స్కూటర్ స్పోర్టీ రెడ్, స్పార్కిల్ బ్లాక్, పెరల్ వైట్, డాసెట్ సిల్వర్ అండ్ కామెట్ గ్రే వంటి ఎన్నో కలర్ ఆప్షన్‌లలో మార్కెట్లోకి ప్రవేశపెట్టరు. దీని 2 kWh బ్యాటరీ (48V, IP67) నుండి శక్తిని తీసుకునే ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. EV తయారీదారి భవిష్యత్తు కార్యకలాపాల కోసం ప్రతి నగరానికి కనీసం 300 బ్యాటరీ ఎక్స్ఛేంజ్ స్టేషన్‌లను ఇన్‌స్టాల్ చేయాలని 10 నగరాలను లక్ష్యంగా చేసుకుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios