నిన్న ముకేష్ అంబానీ, నేడు బాలీవుడ్ నటి.. అతిచిన్న వయసులోనే కోట్ల విలువైన లగ్జరీ కార్ సొంతం..

బాలీవుడ్ నటి అవ్నీత్ కౌర్ తను ఇష్టపడే లగ్జరీ కార్ రేంజ్ రోవర్‌ని తాజాగా కొనుగోలు చేసింది. అయితే ఆమె తన కుటుంబం కొత్త కారుతో పోజులిచ్చిన ఫోటోలను, అలాగే తండ్రితో కలిసి కేక్ కట్ చేస్తున్న వీడియోను కూడా షేర్ చేసింది. ఆమె ఈ కారు చేసిన మొత్తం కార్చు ఇంకా తెలియనప్పటికీ భారతదేశంలో ఈ రేంజ్ రోవర్ వెలార్ ధర   రూ.83 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

bollywood actress buys her dream car, you will be stunned after hearing its price

ప్రముఖ టెలివిజన్ నటి అవ్నీత్ కౌర్ ఈ రోజుల్లో నిరంతరం చర్చలో ఉంటున్నారు. నిజానికి ఈ నటి త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోంది. 20 ఏళ్ల చిన్న వయసులోనే అవ్నీత్ కౌర్ ఎంతో మంది హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ వయసులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా పెద్ద నటీనటులతో పోటీ పడుతూ కనిపిస్తుంది. అవ్నీత్ కౌర్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో నిరంతరం కనెక్ట్ అవుతుంది. ఆమే అభిమానుల సంఖ్య కూడా కోట్లలో ఉండానికి ఇదే కారణం. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నటి అవ్నీత్ కౌర్ తరచుగా తన గ్లామరస్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.  

ఇప్పుడు ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాజా పోస్ట్‌ను షేర్ చేస్తూ అభిమానులతో ఒక ప్రత్యేక క్షణాన్ని పంచుకుంది. అదేంటంటే తన డ్రీమ్ కారును కొనుగోలు చేసినట్లు పోస్ట్ ద్వారా తెలిపింది. ఎట్టకేలకు కొత్త కార్ రేంజ్ రోవర్ కొనుగోలు చేసినట్లు  స్వయంగా తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఈ ఫోటోలో అవ్నీత్ కౌర్ తన కొత్త కారుతో కనిపిస్తుంది. ఈ ఫోటోలో ఈ ప్రత్యేక క్షణం ఆనందం నటి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత ఖరీదైన కారును కేవలం 20 ఏళ్లకే  సంపాదించుకుంది.

అంతేకాదు ఈ కారు ధర వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇటీవలే అవనీత్ కౌర్  కలెక్షన్లలో చేరిన ఈ వాహనం ధర 1.2 కోట్లు. సోషల్ మీడియాలో ఆమె  కారుతో ఉన్న ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ క్యాప్షన్‌లో  ఇది నా కలలు నెరవేరిన సంవత్సరం అంటూ పోస్ట్ చేసింది.

వర్క్ ఫ్రంట్ గురించి మాట్లాడుతూ స్మాల్ స్క్రీన్‌లో తనదైన ముద్ర వేసిన అవ్నీత్ కౌర్ త్వరలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మణికర్ణిక ఫిల్మ్స్ బ్యానర్‌పై కంగనా రనౌత్ నిర్మించిన టికు వెడ్స్ షేరు సినిమాలో కనిపించనుంది. ఈ సినిమాలో అవనీత్‌ కౌర్ తో పాటు బాలీవుడ్ సీనియర్ హీరో నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమాలో అవనీత్‌ కౌర్ టికుగా కనిపించనుంది, అలాగే తెరపై నవాజుద్దీన్ సిద్ధిఖీతో జోడికట్టనుంది. అవ్నీత్  కౌర్ ఇంతకు ముందు కొన్ని సినిమాలో కూడా నటించింది, అయితే ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న మొదటి చిత్రం. విశేషమేమిటంటే అవ్నీత్ కౌర్ మొదటిసారిగా 2010 రియాలిటీ షో డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్‌లో పోటీదారుగా కనిపించింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios