ముంబై: యావత్ భారతావనిలోని వివిధ నగరాల ప్రజలు క్లీనర్ మొబిలిటీ దిశగా అడుగులేస్తున్నారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ అన్ని విద్యుత్ కార్లను సిద్ధం చేసింది. మినీ బ్రాండ్ విద్యుత్ కార్లను తేవడానికి గల అవకాశాలపై అధ్యయనం చేస్తోంది. 

also read జనవరిలో టాటా ‘ఆల్ట్రోజ్’ ఆవిష్కరణ...ఆల్ఫా ఆర్కిటెక్చర్‌తో రూపకల్పన

పలు ఆటోమొబైల్ సంస్థలు విద్యుత్ వాహనాలను భారత విపణిలో విక్రయించాలని భావిస్తున్న తరుణంలోనూ, ఇండియన్ సంస్థలు సొంతంగా విద్యుత్ వాహనాలను విపణిలోకి తేవాలని భావిస్తున్న నేపథ్యంలో బీఎండబ్ల్యూ అధ్యయనం చేయడం గమనార్హం. 

ఈ సందర్భంగా బీఎండబ్ల్యూ మినీ బ్రాండ్ ఆసియా-పసిఫిక్ ఈస్ట్రన్ యూరప్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా రీజియన్స్ అధిపతి ఫ్రాంకోయిస్ రోకా మాట్లాడుతూ ’ఒకవేళ మార్కెట్లో విద్యుత్ వాహనాలకు స్వాగతం పలికే పరిస్థితులు అనుకూలంగా ఉంటే మేం అక్కడ సిద్ధంగా ఉంటాం. చెన్నైలో ప్లాంట్ ఉండటం వల్ల వినియోగదారుల అభీష్ఠానికి అనుగుణంగా విభిన్న మోడళ్లు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులకు అందుబాటు ధరలో లభిస్తాయి’ అని తెలిపారు. 


విద్యుత్ వాహనాలకు గల అవకాశాలపై తమ సంస్థ అధ్యయనం చేస్తోందని బీఎండబ్ల్యూ మినీ బ్రాండ్ ఆసియా-పసిఫిక్ ఈస్ట్రన్ యూరప్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా రీజియన్స్ అధిపతి ఫ్రాంకోయిస్ రోకా అన్నారు. భారీస్థాయిలో విద్యుత్ వాహనాల చార్జింగ్ కోసం మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని ఫ్రాంకోయిస్ రోకా తెలిపారు. అందుకు భారతదేశానికి చాలా కాలం పడుతుందన్నారు. 

also read  హ్యుండాయ్ మోటార్స్ కార్లపై భారీగా ఆఫర్లు...కొద్ది రోజులు మాత్రమే

బీఎండబ్ల్యూ బ్రిటిష్ బ్రాండ్ తొలిసారి ఈ ఏడాది జూలైలో తొలి విద్యుత్ మినీ వాహనం ‘కూపర్ ఎస్ఈ’ని విపణిలోకి ఆవిష్కరించింది. దాని ధర సుమారు రూ.21.5 లక్షలుగా ఉంటుంది. దేశంలో బీఎండబ్ల్యూ మినీ బ్రాండ్‌కు పది ఔట్ లెట్లు ఉన్నాయి. స్మాల్, ప్రీమియం కార్లకు మార్కెట్లో డిమాండ్ ఉంది. 2020 తొలి త్రైమాసికంలో మినీ కారును విపణిలో  ఆవిష్కరిస్తామని ఫ్రాంకోయిస్ రోకా తెలిపారు. లండన్, సింగపూర్, టోక్యో నగరాల్లో వాహనాలను విక్రయిస్తామన్నారు.