లైఫ్ సేఫ్టీ ముఖ్యం: అందుకే బీఎండబ్ల్యూ సెల్ఫ్ డ్రైవ్ బైక్
పౌరుల ప్రాణాల రక్షణే ప్రధానంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు.. మోటార్ బైక్‌లు త్వరలో రోడ్లపై పరుగులు తీయనున్నాయి. ఈ క్రమంలో బీఎండబ్ల్యూ ప్రయోగాత్మకంగా మోటార్ బైక్‌ను తయారు చేసింది. రోడ్డు ముందు పరిస్థితులను ముందే పసిగట్టి రైడర్‌ను హెచ్చరిస్తుంది.
జర్మనీ ఆటోమొబైల్ సంస్థ బివేరియన్ మోటార్ వర్క్స్ (బీఎండబ్ల్యూ) లగ్జరీ కార్ల తయారీలో పేరెన్నికనగన్న సంస్థ. విపణిలోకి కొత్త మోడల్ ద్విచక్ర వాహనాన్ని రూపొందించింది. దాదాపు రెండేళ్లపాటు శ్రమించి 'ఆర్1200 జీఎస్' పేరిట రూపొందించిన ఈ బైక్.. ఈ ప్రోటోటైప్ మోడల్ వీడియోను కంపెనీ శనివారం విడుదల చేసింది. ప్రస్తుతం ఆటోమోటివ్ పరిశ్రమలో సేఫ్టీకి ప్రాధాన్యం పెరుగుతోంది.
మానవ ప్రయత్నం లేకుండానే ఈ బైక్ తానంతటన తనే స్టార్ట్ అవుతుంది. యాక్సిలేటర్ ద్వారా వేగాన్ని పెంచుకుంటుంది. ఆ తర్వాత వేగాన్ని తగ్గించుకొని తానంతట తానే బ్రేక్ వేసుకుంటుంది. స్టాండ్ కూడా వేసుకొని ఆగిపోతుంది. కంపెనీ సేఫ్టీ ఇంజనీర్ స్టీఫన్ హాన్స్ మాట్లాడుతూ మానవులు నడిపే బైకుల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన మరిన్ని భద్రతా చర్యల గురించి తెలుసుకోవడానికే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ప్రోటోటైప్ మోడల్‌ను విడుదల చేశామని చెప్పారు.
శాస్త్ర పరిశోధనల కోసం, వాణిజ్య అవసరాల కోసం ఈ బైక్‌ను రూపొందించినప్పటికీ ఇప్పట్లో ఈ బైకులు మార్కెట్‌లోకి రాకపోవచ్చని కంపెనీ సేఫ్టీ ఇంజనీర్ స్టీఫన్ హాన్స్ చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రోటోటైప్ బైక్ ద్వారా బైకులు నడిపేటప్పుడు మానవులు చేసే తప్పిదాలు ఏమిటో తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు కూడా ఇప్పటికీ ప్రయోగ దశలోనే ఉన్న విషయం తెల్సిందే. అలా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు మార్కెట్ లోకి ప్రవేశించిన తర్వాతే సెల్ఫ్ డ్రైవింగ్ మోటార్ బైక్ లు కూడా వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి.
సెల్ఫ్ డ్రైవింగ్ మోటార్ బైక్స్‌కు ప్రస్తుతానికి మార్కెట్ లో తావు లేదని బీఎండబ్ల్యూ అంగీకరించింది. మోటార్ సైకిల్‌పై రైడ్ చేయడం అంటేనే ఎంజాయ్ మెంట్‌కు, ఎంగేజ్మెంట్‌కు ప్రతీక. అటువంటప్పుడు దీన్నెందుకు తయారు చేశారంటారా? రైడర్ బిహేవియర్, వెహికల్ డైనమిక్స్ తెలుసుకోవడానికి రెండేళ్లుగా రహస్యంగా పరిశోధనలు జరిపిన తర్వాతే ఈ మోటార్ బైక్‌కు రూపమిచ్చింది బీఎండబ్ల్యూ.
ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందో తెలుసుకుని ముందే హెచ్చరిస్తుందీ బైక్. ఏదో ఒక రోజు సాంకేతికంగా అధునాతనంగా అభివ్రుద్ధి చెందిన తర్వాత కార్ల మాదిరిగానే బైక్‌లు కూడా రోడ్లపై పరుగులు తీస్తాయని భావిస్తున్నారు.ఈ మోటార్ బైక్‌కు అంటినా అనుసంధానించి సీటు వెనక స్టోరేజీ కేసు ఏర్పాటు చేస్తారు. ముందు రోడ్డుపై ముందస్తు ప్రమాదాలు, మూల మలుపులు తదితర పరిస్థితులను అంటీనా ముందే గమనించి విశ్లేషించి హెచ్చరిస్తుంది.