బిఎమ్‌డబ్ల్యూ కొత్త సిరీస్.. సెకన్లలో టాప్ స్పీడ్.. ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఎప్పుడైనా చూసారా ..
ఈ కొత్త 3 సిరీస్ రెండు వేరియంట్లలో లభిస్తుంది - ఒకటి 330ఎల్‌ఐ ఎం స్పోర్ట్ అండ్ మరొకటి 320ఎల్‌డి ఎం స్పోర్ట్. పెట్రోల్ వెర్షన్ 2-లీటర్ 4-సిలిండర్ యూనిట్‌తో గరిష్టంగా 258 hp శక్తిని, 400 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
జర్మన్ ఆటో దిగ్గజం బిఎమ్‌డబ్ల్యూ భారత్‌లో కొత్త లాంచ్‌తో వచ్చేసింది. ఎలక్ట్రిక్ ఐ7తో కొత్త 7 సిరీస్ మోడల్‌ను పరిచయం చేసిన తర్వాత, బిఎమ్‌డబ్ల్యూ ఇప్పుడు కొత్త 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్‌ను విడుదల చేసింది. 2023 3 సిరీస్ పెట్రోల్ వేరియంట్ రూ. 57.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో, బిఎమ్‌డబ్ల్యూ డీజిల్ వేరియంట్‌ను రూ. 59.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది. తమిళనాడులోని చెన్నైలోని బిఎమ్‌డబ్ల్యూ ప్లాంట్‌లో ఈ కారు స్థానికంగా తయారవుతోంది.
లుక్స్ అండ్ డిజైన్
కొత్త 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ 4,823 ఎంఎం పొడవు, 2,961 ఎంఎం వీల్‌బేస్ ఉంది, దీని ద్వారా కారు లోపల తగినంత స్థలాన్ని ఇస్తుంది. కారు బయటి భాగం గురించి మాట్లాడితే 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ క్రోమ్-డబుల్ బార్‌లతో కూడిన ఐకానిక్ BMW కిడ్నీ గ్రిల్ పొందుతుంది.
ఇంజిన్ పవర్ అండ్ స్పీడ్
కొత్త 3 సిరీస్ రెండు వేరియంట్లలో లభిస్తుంది - ఒకటి 330ఎల్‌ఐ ఎం స్పోర్ట్ అండ్ మరొకటి 320ఎల్‌డి ఎం స్పోర్ట్. పెట్రోల్ వెర్షన్ 2-లీటర్ 4-సిలిండర్ యూనిట్‌తో గరిష్టంగా 258 hp శక్తిని, 400 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా కేవలం 6.2 సెకన్లలో 0 నుండి 100 kmph స్పీడ్ అందుకోగలదు. డీజిల్ వేరియంట్ 2-లీటర్ 4-సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 190 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని టార్క్ అవుట్‌పుట్ పెట్రోల్ వెర్షన్ లాగానే ఉంటుంది. రెండు ఇంజన్లు 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తాయి.
ఇంటీరియర్ అండ్ ఫీచర్లు
కారు లోపలి భాగం కూడా కై క్వాలిటీగల మెటీరియల్స్‌తో అప్‌డేట్ చేసారు ఇంకా వెనుక ప్రయాణీకులకు మరింత లెగ్ స్పేస్ అందిస్తుంది. డ్యాష్‌బోర్డ్ పై సరికొత్త BMW ఆపరేటింగ్ సిస్టమ్ 8పై పనిచేసే కొత్త BMW కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉంటుంది. కారు లోపల రెండు స్క్రీన్లు ఉన్నాయి. మొదటిది మీడియా ఇంకా కంట్రోల్స్ కోసం 14.9-అంగుళాల డిస్‌ప్లే, రెండవది 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఈ డిస్ ప్లే BMW లైవ్ కాక్‌పిట్ ప్లస్ ఫీచర్స్ వంటి 3D నావిగేషన్‌ను అందిస్తుంది.
ఇతర ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్, ఆపిల్ కార్ ప్లే, అండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, యాంబియంట్ లైటింగ్ కూడా ఉన్నాయి. బిఎండబల్యూ డిజిటల్ కీ ప్లస్‌ను స్టాండర్డ్ గా అందిస్తోంది. ఇది లైటింగ్ ఎఫెక్ట్‌లతో సింక్రొనైజ్ చేయబడిన స్టైలిష్ వెల్‌కమ్ నోట్‌తో ఆటోమేటిక్‌గా డోర్‌లను అన్‌లాక్ చేస్తుంది.
సేఫ్టీ ఫీచర్స్
సేఫ్టీ పరంగా కొత్త 3 సిరీస్ గ్రాన్ లినోస్ ఆటో స్టార్ట్-స్టాప్, బ్రేక్-ఎనర్జీ రీజెనరేషన్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అటెన్షన్ అసిస్ట్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (CBC), ఎలక్ట్రిక్ పార్కింగ్‌తో కూడిన డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (DSC)తో వస్తుంది. ఆటో హోల్డ్‌తో బ్రేక్‌లు, సైడ్-ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్, క్రాష్ సెన్సార్‌లు ఇంకా ISOFIX చైల్డ్ సీట్ మౌంటుతో ఉంటుంది.