బిఎండబల్యూ లిమిటెడ్ ఎడిషన్ కాస్ట్లీ కార్.. 3 సెకన్లలో కళ్ళు చెదిరే స్పీడ్..
ఈ లిమిటెడ్ M8 కాంపిటీషన్ 50 జహ్రే M ఎడిషన్ ఇంజిన్ చాలా శక్తివంతమైనది. కంపెనీ ఇందులో 4.4 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్‌ను అందించింది, ఈ ఇంజన్ 625 bhp, 750 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎండబల్యూ ఇండియాలో M8 కాంపిటీషన్ 50 జహ్రే M ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.55 కోట్లుగా నిర్ణయించింది. అయితే కొన్ని యూనిట్లు మాత్రమే కంపెనీ విక్రయించనుంది.
ఇంజన్ పవర్
ఈ లిమిటెడ్ M8 కాంపిటీషన్ 50 జహ్రే M ఎడిషన్ ఇంజిన్ చాలా శక్తివంతమైనది. కంపెనీ ఇందులో 4.4 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్‌ను అందించింది, ఈ ఇంజన్ 625 bhp, 750 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే V8 ఇంజన్ 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో అందించారు.
కారులో బెస్ట్ డ్రైవింగ్ అనుభవం కోసం కంఫర్ట్, స్పోర్ట్ అండ్ స్పోర్ట్ ప్లస్ మోడ్‌లు అందించారు. ఈ కారు ఇంజిన్ చాలా శక్తివంతమైనది, ఈ కారు కేవలం 3.2 సెకన్లలో 0 నుండి 100 kmph స్పీడ్ అందుకుంటుంది.
ఈ 50వ అన్నివేర్సరీ ఎడిషన్ సాధారణ M8కి భిన్నంగా ఉంటుంది. లిమిటెడ్ ఎడిషన్ M8 డేటోనా బీచ్ బ్లూ కలర్ థీమ్‌తో వస్తుంది, ఇది 50 జహ్రే M ఎడిషన్ కార్లలో మాత్రమే కనిపిస్తుంది. అంతేకాకుండా ఎమ్ ఐల్ ఆఫ్ మ్యాన్ గ్రీన్, బ్రూక్లిన్ గ్రే, స్పెషల్ రెడ్ కలర్ ఆప్షన్‌లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు కస్టమర్లు ఫ్రోజెన్ బ్రిలియంట్ వైట్, ఫ్రోజెన్ మెరీనా బే బ్లూ, ఫ్రోజెన్ డీప్ గ్రీన్ ఇంకా ఫ్రోజెన్ డీప్ గ్రే వంటి కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
స్పెషల్ బ్యాడ్జ్
బిఎండబల్యూ కంపెనీ ఈ కారుపై M8 కాంపిటీషన్ 50 జహ్రే M ఎడిషన్ బ్యాడ్జ్‌ను కూడా ఇచ్చింది. దీనితో పాటు ఎమ్ స్పోర్ట్స్ ఎగ్జాస్ట్, 20-అంగుళాల జెట్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, రెడ్ కలర్ బ్రేక్ కాలిపర్, బ్లాక్ గ్లోస్ లివర్ గ్రిల్, ఎమ్ సీట్ బెల్ట్ వంటి ఫీచర్లు కూడా ఈ కారులో ఉంటాయి.
సేఫ్టీ ఫీచర్స్
కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, DSC, DTC, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్, క్రాష్ సెన్సార్, అటెన్టివ్‌నెస్ అసిస్టెన్స్ ఇంకా ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు ఉన్నాయి.