విలాసవంతమైన కార్ల పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది బీఎండబ్యూ. కేవలం విలాసవంతమైన కార్లను మాత్రమే తయారుచేసే ఈ సంస్థ నుండి మరో స్పోర్ట్స్ కారు భారత మార్కెట్లోకి ప్రవేశించింది. బీఎండబ్ల్యూ 3సిరీస్‌ జీటీ స్పోర్ట్స్‌ రకానికి చెందిన 320డి జీటీ స్పోర్ట్‌ను మార్కెట్లోకి విడుదలచేసింది. ఈ సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ స్పోర్ట్స్ కారు ప్రారంభ ధరను రూ. 46.60 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) నిర్ణయించింది.

ఈ సీరీస్ కార్లు మూడు విభిన్న రంగుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అల్పైన్ వైట్, బ్ల్యాక్ సఫైర్ (మెటాలిక్) మరియు ఇంపీరియల్ బ్లూ బ్రిలియంట్ ఎఫెక్ట్ (మెటాలిక్) రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.   

ఇక ఈ మొడల్  సాంకేతిక  వివరాలిలా ఉన్నాయి. ఇందులో 1,995సీసీ ట్విన్‌ పవర్‌ టర్బో 4 సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను అమర్చారు. దీంతో జిటి స్పోర్ట్ కేవలం 7.7 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ను ఇందులో వాడారు. దీనిలో బీఎండబ్ల్యూ డ్రైవింగ్‌ కంట్రోల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కంఫర్ట్‌, ఎకోప్రో, స్పోర్ట్‌, స్పోర్ట్‌+ మోడ్‌లలో ఈ వాహనాన్ని నడపవచ్చు.

 ఈ బిఎమ్‌‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి స్పోర్ట్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బిఎండబ్ల్యూ అధీకృత డీలర్ల వద్ద లభ్యమవుతోందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.