ద్విచక్ర వాహనాలపై బజాజ్ కంపనీ ''హ్యాట్రిక్'' ఆఫర్

Bajaj Auto’s Hat-trick Offer
Highlights

ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ తమ వాహనాల కొనుగోళ్లను పెంచే లక్ష్యంతో హ్యాట్రిక్ పేరుతో ఓ ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించింది. ఈ సంస్థకు చెందిన కొన్ని ఎంపిక చేసిన వాహనాలను నూతనంగా కొనుగోలుచేసే వినియోగదారులకు బంఫర్ ఆపర్ ప్రకటించింది. 

ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ తమ వాహనాల కొనుగోళ్లను పెంచే లక్ష్యంతో హ్యాట్రిక్ పేరుతో ఓ ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించింది. ఈ సంస్థకు చెందిన కొన్ని ఎంపిక చేసిన వాహనాలను నూతనంగా కొనుగోలుచేసే వినియోగదారులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. 

ఈ ఆఫర్ కింద ఎంపిక చేసిన మోడల్స్ ని కొనుగోలు చేసే వినియోగదారులకు ఖచ్చితమైన వ్యారెంటీ, ఉచిత సర్విసింగ్ తో  పాటు ఇన్సూరెన్స్ సర్వీస్ ను బజాజ్ సంస్థే అందించనుంది. ఈ ఆఫర్ జూలై 1 వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో ద్విచక్రవాహనాలను కొనుగోలు చేసే వారికి ఒక సంవత్సరం భీమా, రెండు సంవత్సరాల ఫీ సర్వీసింగ్, ఐదు సంవత్సరాల  వ్యారంటీ తో షరతులకు లోబడి సదుపాయాలను కల్పించనున్నారు.

బజాజ్ సంస్థకు చెందిన  ప్లాటినా, డిస్కవరీ, పల్సర్ 150, పల్సర్ ఎన్‌ఎస్ 160, వీ రేంజ్ మోటార్‌సైకిళ్లపై ఏడాది పాటు ఉచితంగా బీమా లభించనున్నదని కంపెనీ ప్రెసిడెంట్ ఎరిక్ వ్యాస్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సిటీ 100, ప్లాటినా, డిస్కవరీ, పల్సర్, పల్సర్ ఎన్‌ఎస్, అవెంజర్, పల్సర్ ఆర్‌ఎస్, వీ, డొమినర్ వాహనాలపై రెండేండ్ల పాటు ఉచితంగా సర్వీసింగ్ కల్పిస్తున్నది. అలాగే ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా ఐదేండ్లపాటు వ్యారెంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు.

అలాగే తక్కువ డౌన్ పేమెంట్ తో ఈ వాహనాలను సొంతం చేసుకునే అవకాశాన్ని బజాజ్ సంస్థ కల్పించింది. అంతే కాకుండా తక్కువ వడ్డీ శాతాన్ని వసూలు చేయనున్నట్లు బజాజ్ సంస్థ ప్రకటించింది. 

loader