టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రభాస్ డ్రీం కారు.. హైదరాబాద్ రోడ్లపై నడుపుతూ చక్కర్లు.. సోషల్ మీడియాలో వైరల్..
ప్రభాస్ నటించిన సినిమాలలో 'బాహుబలి' చిత్రం బాక్సాఫీస్ హిట్ కొట్టిన సంగతి మీకు తెలిసిందే. ఆయన సినిమాలకి అభిమానులు దక్షిణ భారతంలోనే కాదు, ఉత్తరాన కూడా ఉన్నారు. తాజాగా ప్రభాస్ తన డ్రీమ్ కారును కొనుగోలు చేశాడు.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ హీరో ప్రభాస్ 'బాహుబలి' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నాడు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఆయనకు చాలా ఫాలోవర్స్ ఉన్నారు.
ప్రభాస్ నటించిన సినిమాలలో 'బాహుబలి' చిత్రం బాక్సాఫీస్ హిట్ కొట్టిన సంగతి మీకు తెలిసిందే. ఆయన సినిమాలకి అభిమానులు దక్షిణ భారతంలోనే కాదు, ఉత్తరాన కూడా ఉన్నారు. తాజాగా ప్రభాస్ తన డ్రీమ్ కారును కొనుగోలు చేశాడు. ఈ డ్రీమ్ కార్ సంబంధించిన ఒక వీడియొ ట్విట్టర్ లో వైరల్ అవుతుంది. ప్రభాస్ లైఫ్ స్టయిల్, ఆస్తి గురుంచి తెలిస్తే మీరు నోరెళ్ళబెట్టాల్సిందే...
ప్రభాస్ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ప్రభాస్ కి చెందిన ఒక వీడియొని ట్విట్టర్ లో చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది, ఇందులో ప్రభాస్ తన డ్రీం కారుతో కనిపిస్తాడు.
also read మహీంద్ర ట్రక్కులో మద్యం అక్రమ రవాణా.. మేం ఇంకా అంతా ఎదగలేదురా బాబు అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్.. ...
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభాస్ కొనుగోలు చేసిన ఈ లంబోర్ఘిని అవెంటడార్ ఎస్ రోడ్‌స్టర్ కారు ధర 6 కోట్లు. హైదరాబాద్ రోడ్లపై ప్రభాస్ నడుపుతున్న లంబోర్ఘిని వీడియో సోషల్ మీడియాలో వేలాది లైక్స్ వచ్చాయి. విషయం ఏంటంటే తన తండ్రి సూర్య నారాయణ్ రాజు జయంతి సందర్భంగా ఈ కారును కొన్నాడు.
ప్రభాస్ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు లంబోర్ఘిని కారు కొనాలని కలలు కనెవాడట. ఆ కల ఇప్పుడు నెరవేరింద. ఈ లగ్జరీ కారు గురించి తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు సంతోషంతో కారు ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
సౌత్ హీరో ప్రభాస్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టమట. ఇప్పటికే చాలా ఖరీదైన కార్లు ప్రభాస్ గ్యారేజీలో చేరాయి . అతని కార్ల సేకరణలో 1.25 మిలియన్ల జాగ్వార్ ఎక్స్‌జె, 8 కోట్ల రోల్స్ రాయిస్ ఫాంటమ్, 50 మిలియన్ల బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ -3, 4 కోట్ల రేంజ్ రోవర్, 30 లక్షల స్కోడా సూపర్బ్ ఉన్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. త్వరలోనే థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం కాకుండా ప్రభాస్ 'ఆదిపురుష్', 'సాలార్' షూటింగ్ ల్లో బిజీగా ఉన్నారు.