దేశీయ ఆటోమొబైల్ సంస్థలు ఆదా చర్యలు చేపట్టాయి. వాహనాలు ఉత్పతి చేసి నిల్వలు పెంచుకునేకన్నా, డిమాండ్, గిరాకీని బట్టి వాహన ఉత్పత్తిని తగ్గించేస్తున్నాయి. ఆ బాటలో మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ పయనిస్తున్నాయి.
న్యూఢిల్లీ: మారుతి సుజుకితోపాటు దేశీయ ఆటోమొబైల్ సంస్థలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిలో కోత విధిస్తున్నాయి. ప్రస్తుత త్రైమాసికంలో వేర్వేరు యూనిట్లలో 8-14 రోజుల పాటు ఉత్పత్తి నిలిపి వేస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది.
దేశంలో వివిధ ఉత్పాదక యూనిట్లలో ‘నో ప్రొడక్షన్ డేస్’ అమలు చేస్తున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మహీంద్రా పేర్కొంది. ఏప్రిల్-జూలై మధ్యకాలంలో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ 1,61,604 వాహనాలను ఉత్పత్తి చేసింది.
2018లో ఇదే కాలంలో మహీంద్రా అండ్ మహీంద్రా ఉత్పత్తి చేసిన 1,75,329 వాహనాలతో పోలిస్తే, ఈసారి 8% తక్కువ. ఇదే సమయంలో మొత్తం అమ్మకాలు (ఎగుమతులు సహా) 1.87 లక్షల నుంచి 8 శాతం తక్కువగా 1.72 లక్షలకు పరిమితమయ్యాయి.
గిరాకీకి అనుగుణంగా ఉత్పత్తి షిఫ్ట్‌లు, కాంట్రాక్టు సిబ్బందిని తగ్గిస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. జూలైలో ఉత్పత్తి 25.15 శాతం తగ్గించినట్లు మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. 25.15 శాతం ఉత్పత్తి చెప్పడం గమనార్హం. వరుసగా ఇలా కోత విధించడం ఇది 6వ నెల.
జనరల్ మోటార్స్, టయోటా మోటార్స్, సంస్థలు కూడా వాహనాల ఉత్పత్తిని తగ్గించేశాయి. వాహన విడిభాగాల తయారీ సంస్థలైన బాష్ 13 రోజులు, జామ్నా ఆటో నెల పాటు ఉత్పత్తి నిలిపి వేయనున్నాయి. సియామ్ డేటా ప్రకారం ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో కార్ల విక్రయాలు 12.35 శాతం తగ్గింది. గతేడాది తొలి త్రైమాసికంలో 69,42,742 కార్లు అమ్ముడుపోతే, ఈ ఏడాది 60,85,406 యూనిట్లు అమ్ముడయ్యాయి.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 10, 2019, 10:40 AM IST