వచ్చే ఏడాది విద్యుత్ వెహికల్ సెగ్మెంట్‌లోకి ‘ఆడి’


లగ్జరీ కార్లపై భారీగా పన్నుల భారం మోపడంతో వినియోగదారులు కొనేందుకు వెనుకంజ వేస్తున్నారని ఆడి ఇండియా హెడ్ రాహిల్ అన్సారీ ఆందోళన వ్యక్తం చేశారు. కనుక వాటిని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తమ అమ్మకాలను పెంచుకునేందుకు ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోకి మార్కెట్‌ను విస్తరిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది భారత్ మార్కెట్లోకి విద్యుత్ వినియోగ కారు వస్తుందని చెప్పారు. 

Audi India expects subdued growth in 2019; rues high tax on luxury cars

జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి’ దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఇప్పటికే పలు వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసిన సంస్థ.. ఈ ఏడాది మరో మూడు వాహనాలను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. వీటిలో క్యూ8, ఏ8, ఆర్8లు ఉన్నాయని కంపెనీ ఇండియా హెడ్ రాహిల్ అన్సారీ తెలిపారు. 

హైదరాబాద్‌లో సంస్థ షోరూంను ఆడి ఇండియా హెడ్ రాహిల్ అన్సారీ ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడూ భారత్‌లో లగ్జరీ కార్లపై విధిస్తున్న అధిక పన్ను కారణంగా అమ్మకాల్లో నిస్తేజం నెలకొన్నదని, వీటిని తగ్గించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

ప్రస్తుతం లగ్జరీ కార్లపై 28 శాతం జీఎస్టీతోపాటు 15 శాతం నుంచి 22 శాతం వరకు సెస్‌ను విధిస్తున్నారు. ఇది చాలా గరిష్ఠమని, దీంతో కార్ల కొనుగోలుకు వినియోగదారులు జంకుతున్నారని ఆడి ఇండియా హెడ్ రాహిల్ అన్సారీ ఆందోళన వ్యక్తంచేశారు. 

దీంతో ప్రస్తుత సంవత్సరంలో అమ్మకాల్లో పెద్దగా వృద్ధిని నమోదు చేసుకునే అవకాశాలు లేవని ఆడి ఇండియా హెడ్ రాహిల్ అన్సారీ స్పష్టంచేశారు. గతేడాది సంస్థ 6,463 యూనిట్ల వాహనాలను విక్రయించింది. వచ్చే ఏడాది విద్యుత్‌తో నడిచే వాహనాన్ని భారత్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కానీ ఇందుకు అనువైన పరిస్థితులు నెలకొనాలని, ముఖ్యంగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

తమ కార్ల అమ్మకాలను పెంచుకోవడానికి ఆడీ తన పంథాను, వ్యూహాన్ని మార్చుకుంటున్నది. ఇప్పటి వరకు మెట్రో నగరాలపై దృష్టి సారించిన సంస్థ..ఇక నుంచి చిన్న పట్టణాలపై కన్నేసింది. డీలర్లను ఏర్పాటు చేయడంతోపాటు అక్కడే సర్వీసింగ్ స్టేషన్లను నెలకొల్పనున్నట్లు ఆడి ఇండియా హెడ్ రాహిల్ అన్సారీ ప్రకటించారు. మరోవైపు 2020 నుంచి బీఎస్-6 ప్రమాణాలకు లోబడి కార్లను రూపొందించనున్నది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios