Asianet News TeluguAsianet News Telugu

ఎలక్ట్రిక్ స్కూటర్‌పై బంపర్ ఆఫర్.. రూ. 1కి రెండు సంవత్సరాల వారంటీ.. కొద్దిరోజులే ఛాన్స్..

ఈ నెల అంటే 31 డిసెంబర్ 2022 వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై ఈజీ ఫైనాన్స్, ఎక్స్ఛేంజ్, వారంటీ వంటి స్కీంస్ ఏథర్ అందిస్తోంది. కంపెనీ కేవలం రూ.1కి ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీని కూడా అందిస్తోంది. 

Ather Electric: Strong offer on Ather electric scooter in the last month of the year, know full details
Author
First Published Dec 7, 2022, 5:15 PM IST

మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. బెంగళూరు స్టార్టప్ ఏథర్ ఎనర్జీ నుండి వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లపై కూడా మంచి ఆఫర్ లభిస్తుంది. ఈ సంవత్సరం చివరి నెల అంటే డిసెంబర్ నెలలో స్కూటర్ కొనుగోలుపై ఏథర్ కంపెనీ ఎలాంటి ఆఫర్ అందిస్తుందంటే..

ఆఫర్ 
31 డిసెంబర్ 2022 వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై ఈజీ ఫైనాన్స్, ఎక్స్ఛేంజ్, వారంటీ వంటి స్కీంస్ ఏథర్ అందిస్తోంది. కంపెనీ కేవలం రూ.1కి ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీని కూడా అందిస్తోంది. కంపెనీ నుండి ఆఫర్ లేకుండా అయితే ఎక్స్టెండెడ్ వారంటీకి రూ.6999 చెల్లించాలి. కానీ స్కీమ్ కింద, బ్యాటరీ వారంటీని మూడు సంవత్సరాలు అలాగే కేవలం రూ. 1కి మరో రెండు సంవత్సరాలు అందిస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ ఆఫర్  లిమిటెడ్ పీరియడ్ మాత్రమే.

తక్కువ వడ్డీకే స్కూటర్ 
కంపెనీ ప్రైవేట్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని కింద కంపెనీ స్కూటర్ ని తక్కువ వడ్డీకే తీసుకోవచ్చు. కంపెనీ అప్‌జిప్ పథకం కింద 8.50 శాతం వడ్డీ రేటుతో 12 నుండి 48 నెలల EMI వద్ద స్కూటర్‌ను అందిస్తోంది. అంతేకాకుండా, అడ్వాన్స్ EMI స్కీమ్ కింద స్కూటర్‌ను తీసుకునేందుకు 5.99, 6.99 శాతం వడ్డీ రేటుతో 12 నుండి 36 నెలల EMI ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఫ్రీ ఛార్జింగ్ 

కంపెనీ ప్రకారం, రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల వేరియంట్లలో దేనినైనా కొన్న తర్వాత, డిసెంబర్ 31, 2023 వరకు ఏథర్ గ్రిడ్‌కు ఫ్రీ యాక్సెస్‌ ఇస్తోంది. కంపెనీ గ్రిడ్ ఛార్జింగ్‌ని ఇండియాలోని కస్టమర్లందరూ ఉపయోగించుకోవచ్చు, దీని కోసం ఎలాంటి చార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు. కంపెనీ దేశవ్యాప్తంగా 700 కంటే ఎక్కువ గ్రిడ్ పాయింట్లలో ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది.

ఏ స్కూటర్లకు ఆఫర్ 
ఈ ఆఫర్‌ను కంపెనీ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లపై అందిస్తోంది. వీటిలో Ather 450X అండ్ Ather 450 Plus ఉన్నాయి. ఈ ఆఫర్ 31 డిసెంబర్ 2022 వరకు రెండు స్కూటర్లపై ఉంటుంది.

కంపెనీ ప్రస్తుతం రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటిలో Ather 450X అండ్ 450 Plus ఉన్నాయి. 450 ప్లస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.17 లక్షలు. ఈ స్కూటర్ సున్నా నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.9 సెకన్లలో అందుకుంటుంది. కంపెనీ ప్రకారం, దీని రేంజ్ 85 కిలోమీటర్లు. దీని మోటార్ 5.4KW పవర్ అండ్ 22 న్యూటన్ మీటర్ల టార్క్ ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌తో 10 నిమిషాల్లో 10 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. బ్లూటూత్ కాల్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో లేవు.

అలాగే 450X స్కూటర్ 3.3 సెకన్లలో సున్నా నుండి 40 కి.మీ స్పీడ్ అందుకోగలదు. కంపెనీ ప్రకారం, దీని ట్రు రేంజ్ 105 కిలోమీటర్లు. స్కూటర్‌లో అమర్చిన మోటారు 6.2KW పవర్ అండ్ 26 న్యూటన్ మీటర్ల టార్క్ ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌తో, 10 నిమిషాల పాటు ఛార్జింగ్ చేసిన తర్వాత 15 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.39 లక్షలు.

Follow Us:
Download App:
  • android
  • ios