Asianet News TeluguAsianet News Telugu

మీరు కొత్త కారు లేదా బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా.. అయితే వెంటనే నిర్ణయించుకోండి లేదంటే ?

గత నెల జనవరి ప్రారంభంలో ఆటోమొబైల్  కంపెనీలు వాహనాల ధరలను పెంచాయి, ఆ సమయంలో కంపెనీల ధరల పెంపు లేకుంటే వాహనాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని వాదించాయి, ఈ కారణంగా ధరలను పెంచవలసి వచ్చాయని సూచించింది. 

are you buying a new car or bike decide immediately the prices of vehicles may hike for the second time
Author
Hyderabad, First Published Feb 16, 2021, 2:25 PM IST

దేశంలో వాహనాల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. గత నెల జనవరి ప్రారంభంలో ఆటోమొబైల్  కంపెనీలు వాహనాల ధరలను పెంచాయి, ఆ సమయంలో కంపెనీల ధరల పెంపు లేకుంటే వాహనాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని వాదించాయి,

ఈ కారణంగా ధరలను పెంచవలసి వచ్చాయని సూచించింది. ఇటీవల ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్  కూడా కొన్ని మోడల్ల ధరలను రెండవసారి పెంచింది.

వాహనాల ధరలు 1-3 శాతం పెరిగే అవకాశం 
ముడి పదార్థాల ధరలు కొంతకాలంగా నిరంతరం పెరుగుతున్నాయని ఆటోమొబైల్  కంపెనీలు చెబుతున్నాయి, ఈ కారణంగానే వారు రెండవ సారి ధరలను పెంచవలసి వస్తుందని తెలిపాయి. ఒకవేళ ఇదే జరిగితే వాహనాల ధరలు 1-3 శాతం పెంచే అవకాశం ఉంది.

మహీంద్రా & మహీంద్రా, ఐషర్ మోటార్స్, అశోక్ లేలాండ్  ఏప్రిల్ - మే మధ్య తమ వాహనాల ధరలను మరోసారి పెంచవచ్చు. అల్యూమినియం, స్టీల్, ఇతర లోహాల ధరలు బాగా పెరిగాయని ఇది ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని కంపెనీలు సూచించాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల ధరలు  
రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా రెండవసారి బైక్ల ధరలను పెంచడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల కంపెనీ అత్యధికంగా అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధరలను మరోసారి  పెంచింది. కంపెనీ ఇప్పటివరకు క్లాసిక్ 350 ధరను 6,289 రూపాయలకు పెంచింది.

2020 డిసెంబర్ నుండి ఫిబ్రవరి 2021 వరకు రెండు నెలల కాలంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల ధరలను  సగటున 3.4 శాతం పెంచింది. ముడిసరుకు ఖర్చులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నాట్లు కంపెనీ తెలిపింది. 

also read ఫిబ్రవరి 15న భారత మార్కెట్లోకి రెనాల్ట్ కైగర్.. ఈ చౌకైన ఎస్‌యూ‌వి ఫీచర్డ్స్, ధర తెలుసుకోండి ...

గత రెండేళ్లలో అమ్మకాలతో బాధపడుతున్న ట్రక్ మార్కెట్ ఇటీవల కొంత ఊపందుకుంది. గత ఏడాది అక్టోబర్,  జనవరి 2021లో మాత్రమే ట్రక్కుల ధరలను పెంచామని, అయితే ఉక్కు, ఇతర  లోహాల ధరలు కొంతకాలంగా పెరిగాయని అశోక్ లేలాండ్ తెలిపింది.

ఇది ఇలానే కొనసాగితే ధరలను పెంచడం తప్ప  వేరే మార్గం ఉండదని వెల్లడించారు.

 ట్రక్ తయారీదారులకు ధరల పెంపు తీవ్రంగా ప్రభావితం చేసింది. మొదట ఉద్గార ప్రమాణాలను నేరుగా బిఎస్ 4 నుండి బిఎస్ 6 కి మార్చవలసి వచ్చింది, ఈ కారణంగా ధరలను భారీగా పెంచాల్సి వచ్చింది.

అయితే వాణిజ్య వాహనాల మార్కెట్ అప్పటికే బలహీనంగా ఉంది. మూడవ త్రైమాసికంలో ముడి పదార్థాల ధరలు పెరగటంతో వాహనాల ధరలను మళ్లీ పెంచాల్సి వచ్చింది. ఒక అంచనా ప్రకారం గత ఏడాది ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ట్రక్కుల అమ్మకాలు 54 శాతం తగ్గాయి.

 ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా మహీంద్రా  కూడా ధరలను పెంచింది. అంతే కాకుండా సెమీకండక్టర్ చిప్ సరఫరాలో ఇప్పటికీ కొంత సమస్య ఉంది. మరో విషయం ఏంటంటే ఆటోమొబైల్ కంపెనీలకు స్టీల్ సెమీ కండక్టర్ చిప్ కొరత కూడా ఉంది,

ఈ చిప్ విదేశాల నుండి దిగుమతి అవుతుంది. ఈ సెమీకండక్టర్ చిప్ ఆటోమొబైల్ పరిశ్రమలో తయారవుతున్న కొత్త ఆధునిక కార్లలో చాలా అవసరం. దీనివల్ల కార్ల డెలివరీని కూడా ప్రభావితం చేస్తుంది.

 స్టీల్ మిల్లులు జనవరిలో ఉక్కు ధరలను పెంచాయి ఒక విధంగ చెప్పాలంటే టన్నుకు 7250 రూపాయలు పెంచాయి. కానీ ఇప్పుడు డిమాండ్ మెత్తబడింది. స్టీల్ మిల్లులు, ఆటోమొబైల్  కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నాయి, కానీ ప్రధాన సమస్య సరఫరా.

ఆటోమొబైల్  కంపెనీలు 100 టన్నుల ఉక్కును ఆర్డర్‌ చేస్తుంటే వాటికి 20-30 టన్నులు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ధరల పెరుగుదల ఉక్కు తయారీదారులను కూడా ప్రభావితం చేస్తుంది.

ఎందుకంటే ఉక్కు తయారీదారులు మూడవ త్రైమాసికంలో ఫోర్జింగ్ నాణ్యత ఉక్కు ధరలను రెండుసార్లు పెంచగా, రెండవ రకం ఉక్కు ధరలు అక్టోబర్-డిసెంబర్‌లోనే మూడు రెట్లు పెరిగాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios