రోల్స్ రాయిస్ కారులో పెట్రోలింగ్‌ చేస్తున్న వీడియోను మియామీ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో షేర్ చేసిన  త్వరగా మరింత వైరల్ అయ్యింది. 

పోలీసులు సాధారణంగా పెట్రోలింగ్ కోసం ఇన్నోవా లేదా మహీంద్రా బొలెరో ఉపయోగిస్తుంటారు. ఇక కొన్ని ప్రదేశాలలో బైక్ కూడా వాడుతుంటారు. 

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ కారు రోల్స్‌ రాయల్స్‌ను తొలిసారిగా కోస్టల్ పెట్రోలింగ్ డ్యూటీకి వినియోగిస్తున్నారు. అవును.. ఈ లగ్జరీ కారుతో అమెరికాలోని మియామీ బీచ్‌లో పోలీసులు పహారా కాస్తున్నారు.

అమెరికాలో లగ్జరీ కార్ల వాడకం సర్వసాధారణం. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే తొలిసారిగా మియామీ బీచ్‌లో గస్తీ కాస్తున్న పోలీసులు రోల్స్ రాయల్స్‌ను ఉపయోగించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

పెట్రోలింగ్‌లో ఉన్న రోల్స్ రాయిస్ కారు వీడియోను మియామీ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో షేర్ చేసిన త్వరగా మరింత వైరల్ అయ్యింది.

పెట్రోలింగ్ పనులకు రోల్స్ రాయిస్ కారును వాడుతున్నారంటూ పలువురు నెటిజన్లు ఆశ్చర్యంతో కామెంట్ చేయగా, పెట్రోలింగ్‌కు కోట్ల రూపాయల లగ్జరీ కారు వచ్చిందని కొందరు జోకులు కూడా వేస్తున్నారు.


Scroll to load tweet…