మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ న్యూ సీఎల్ఎస్ ఆవిష్కరణ
మార్కెట్లోకి విడుదల చేసిన మెర్సిడెస్ - బెంజ్ నూతన తరం కారు ‘సీఎల్ఎస్’ మూడోతరం మోడల్ కారు. ప్రత్యర్థి ఆటోమొబైల్ సంస్థలు ఆడి ఎ7, , బీఎండబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపీలకు పోటీగా నిలిచింది.
న్యూఢిల్లీ: మెర్సిడెస్- బెంజ్ మూడోతరం మోడల్ కారు సీఎల్ఎస్ 4- డోర్లతో తయారు చేసిన కారు మార్కెట్లోకి విడుదల చేశారు. విలాసవంతమైన ఈ కారు ధర రూ.84.7 లక్షలతో ప్రారంభం అవుతుంది. తాజాగా విడుదల కానున్న ఆడీ ఎ7, బీఎండబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కౌప్ మోడల్ కార్లకు గట్టి పోటీనిస్తుంది.
నూతన మెర్సిడెస్ సీఎల్ఎస్ కారు అసలు సిసలు డిజైన్‌కు మారుపేరుగా నిలిచింది. ఎంతో విలాసవంతమైన ఈ కారు సొగసులా స్లోపింగ్ రూఫ్ లైన్, ఫ్రేమ్‌లెస్ డోర్లు కలిగి ఉంది. న్యూ యాంగ్యులర్, అత్యంత అగ్రెస్సివ్ హెడ్ ల్యాంప్‌లు, న్యూ గ్రిల్లె డిజైన్ కలిగి ఉంది. టైల్ క్యాంప్ క్లస్టర్, స్టబ్బీ బూట్, స్ప్లిట్ 5-స్పోక్ 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ కారుకు అదనపు ఆకర్షణ.
కారు లోపల హై క్వాలిటీ ఉడ్ అడోర్న్, నాలుగుజెట్ టైర్బైన్లతో స్ఫూర్తి పొందిన ఏసీ, రెండు పొడవైన స్ర్కీన్లు ఉంటే, వాటిలో ఒకటి ఇన్ఫోటైన్మెంట, మరొకటి డిజిటల్ డాష్ బోర్డును కలిగి ఉంటుంది. సాంకేతికంగా ఐదుగురు ప్రయాణం చేయడానికి వీలుగా ఉన్నా భారీ కాయం గల వారిలో నలుగురు మాత్రమే ప్రయాణించే వీలు కలిగి ఉంది.
ప్రస్తుతం సీఎల్ఎస్ 300డీ వర్షన్‌తో మెర్సిడెస్ బెంజ్ కారు బాయ్‌నెట్.. భారత్ స్టేజ్ (బీఎస్- 6) వర్షన్ టెక్నాలజీతో డెవలప్ చేసిన కారును అందుబాటులోకి తెచ్చింది. 2.0 లీటర్ల ఇంజిన్, 242 బీహెచ్పీ, 500 ఎన్ఎం పీక్ టార్చ్‌ను డెవలప్ చేశారు. న్యూ సీఎల్ఎస్ కారులో 9- స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఏర్పాటు చేశారు. 6.2 సెకన్లలో 0-100 కిలోమీటర్ల స్పీడ్.. తదుపరి 250 కిలోమీటర్ల వేగం పుంజుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది.