నాలుగు లక్షలకు పైగా కియా కార్లకు రికాల్ జారీ.. ప్రమాదంలో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోకపోవడం వల్లే అంటు..

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా 4 లక్షలకు పైగా కార్లకు  రికాల్ జారీ చేసింది. అయితే ఇందుకు ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ కంప్యూటర్ కవర్ మెమరీ చిప్‌ని తాకడం వల్ల ఎలక్ట్రికల్ సర్క్యూట్‌లు దెబ్బతింటాయని ఇంకా ఎయిర్ బ్యాగ్‌లు తెరవకుండా నిరోధించవచ్చు అని పేర్కొంది. 
 

Airbags will not open in such an accident in Kia's cars 4.1 lakh vehicles were recalled

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా (KIA) వాహనాలల్లో ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోకుండా నిరోధించే సమస్య  ఏర్పడటంతో  యూ‌ఎస్ లో 4,10,000 కంటే ఎక్కువ వాహనాలను రీకాల్ జారి చేసింది. 

ఈ కంపెనీ రీకాల్ 2017 నుండి 2018 మోడల్‌ల నుండి కొన్ని ఫోర్టే చిన్న కార్లను అలాగే 2017 నుండి 2019 వరకు సెడానా మినీవాన్, చిన్న ఎస్‌యూ‌విలు ఉన్నాయి. అలాగే, కంపెనీ ఎలక్ట్రిక్ కారు సోల్‌ను కూడా రీకాల్ చేసింది. 

ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ కంప్యూటర్ కవర్ మెమరీ చిప్‌ని తాకడం వల్ల ఎలక్ట్రికల్ సర్క్యూట్‌లు దెబ్బతింటాయని సంస్థ తెలిపింది. దీంతో ఎయిర్ బ్యాగ్‌లు తెరవకుండా నిరోధించవచ్చు. డీలర్లు కంప్యూటర్‌ని చెక్ చేసి సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం లేదా భర్తీ చేస్తారు. 

పొటెన్షియల్ సమస్యలు ఉన్న వాహనాల యజమానులకు మార్చి 21 నుండి మెయిల్ ద్వారా తెలియజేయబడుతుందని కంపెనీ తెలిపింది. 

గత జులైలో కొరియాలో తొలిసారిగా ఈ సమస్య తలెత్తిందని అమెరికా భద్రతా నియంత్రణాధికారులు శుక్రవారం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ లో కియా పేర్కొంది. తమకు 13 కస్టమర్ ఫిర్యాదులు, 947 వారంటీ క్లెయిమ్‌లు వచ్చాయని కంపెనీ తెలిపింది. అయితే దీనివల్ల ఎలాంటి ప్రమాదం  జరిగినట్లు సమాచారం లేదు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios