హోండా ‘సీబీఆర్ 650ఆర్’ బుకింగ్స్ షురూ
హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ కంపెనీ కొత్తగా మార్కెట్లోకి ‘సీబీఆర్ 650’ పేరిట కొత్త మోడల్ బైక్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.15,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. దీని ధర రూ.8 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ బైక్ కవాసాకికి చెందిన నింజా 650, ట్రయంఫ్ స్ట్రీట్‌కు చెందిన ట్రిపుల్ ఎస్, సుజుకి జీఎస్ఎక్స్ -ఎస్ 750 వంటి మోటారు సైకిళ్లకు గట్టిపోటీ ఇవ్వనున్నది.
న్యూఢిల్లీ: త్వరలో విడుదల చేయనున్న మధ్యస్థాయి స్పోర్ట్స్ బైకు సీబీఆర్ 650ఆర్ ముందస్తు బుకింగ్‌లను హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ప్రారంభించింది. రూ.15,000 చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని హోండా వెల్లడించింది.
హోండా సీబీఆర్ 650 మోడల్ బైక్ ధర రూ.8 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది. మిలాన్‌లో జరిగిన 2018 ఈఐసీఎంఏ షోలో ఆవిష్కరించిన ఈ బైకు.. సీబీఆర్ 650ఎఫ్ స్థానాన్ని ‘సీబీఆర్ 650ఆర్’ భర్తీ చేస్తుందని కంపెనీ తెలిపింది.
‘2019లో విడుదల చేయనున్న మోడళ్లను ఈఐసీఎంఏ షోలో ప్రదర్శించాం. భారత్‌లో ఇప్పుడు సీబీఆర్ 650ఆర్ బుకింగ్‌లు ప్రారంభిస్తున్నాం’ అని హెచ్‌ఎంఎస్‌ఐ సీనియర్ ఉపాధ్యక్షుడు (అమ్మకాలు, మార్కెటింగ్) యద్వింధర్ సింగ్ గులేరియా పేర్కొన్నారు. కొత్త సీబీఆర్ 650ఆర్ బైకులో 649సీసీ లిక్విడ్ కూల్డ్ ఫోర్-సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు.
యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థ వంటి భద్రతా సదుపాయాలు హోండా సీబీఆర్ 650 బైక్‌లో ఉన్నాయి. ఇందులో డ్యూయల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, డిజిటల్ ఎల్సీడీ డిస్ ప్లే చేర్చారు. గ్రాండ్ ప్రిక్స్, మాట్టే గన్ పౌడర్ బ్లాక్ మెటాలిక్ రంగుల్లో ఈ బైక్ లభిస్తుంది.
ఇంతకు ముందుతరం మోడల్‌తో పోలిస్తే చాసిస్ 6 కేజీలు బరువు తక్కువ అని కంపెనీ తెలిపింది. దేశంలోని 22 నగరాల్లో ఉన్న హోండా వింగ్ వరల్డ్ షోరూమ్‌ల్లో కొత్త సీబీఆర్ 650ఆర్ లభిస్తుంది. గేర్ పొజిషన్ ఇండికేటర్, ఇండికేటర్ ను మిక్స్ చేసే అవకాశం ఉన్నది. ఈ బైక్ ప్రత్యర్థి సంస్థలైన కవాసాకికి చెందిన నింజా 650, ట్రయంఫ్ స్ట్రీట్‌కు చెందిన ట్రిపుల్ ఎస్, సుజుకి జీఎస్ఎక్స్ -ఎస్ 750 వంటి మోటారు సైకిళ్లకు గట్టిపోటీ ఇవ్వనున్నది.