బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త బైక్‌లు...ధరెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే...

ప్రీమియం మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ మోటరాడ్’ రెండు కొత్త బైక్‌లను మార్కెట్లోకి ఆవిష్కరించింది. వాటి ధరలు రూ.16.85 లక్షలతో ప్రారంభం అవుతాయి.  

2019 BMW R 1250 GS & R 1250 GS Adventure Launched In India

న్యూఢిల్లీ: ప్రీమియం మోటార్‌సైకిళ్ల సంస్థ ‘బీఎండబ్ల్యూ మోటరాడ్‌’ భారతదేశ మార్కెట్లోకి రెండు కొత్త మోడల్ బైక్‌లను విడుదలచేసింది. బీఎండబ్ల్యూ ఆర్‌ 1250 జీఎస్‌, బీఎండబ్ల్యూ ఆర్‌ 1250 జీఎస్‌ అడ్వెంచర్‌ పేరిట ఈ మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయి. ‘ఆర్‌ 1250 జీఎస్‌ స్టాండర్డ్‌’ ధర రూ.16.85 లక్షలు, ఆర్‌ 1250 జీఎస్‌ ప్రో ధర రూ.20.05 లక్షలు, బీఎండబ్ల్యూ ఆర్‌ 1250 జీఎస్‌ అడ్వెంచర్‌ స్టాండర్డ్‌ ధర రూ.18.25 లక్షలు, అడ్వెంచర్‌ ప్రో ధర రూ.21.95 లక్షలుగా నిర్ణయించారు.

టూ సిలిండర్‌ ఇన్‌లైన్‌ 1,254 సీసీ ఇంజన్‌ కలిగిన ఈ బైక్స్‌ 136 హెచ్‌పీ పవర్‌ను వెలువరిస్తాయి. గతేడాది అత్యధిక అమ్మకాలను నమోదు చేసుకున్న ఐదు మోడళ్లలో భారత్‌లో తయారు చేసిన జీ 310, జీ 310 జీఎస్‌ ఉన్నాయని బీఎండబ్ల్యూ మోటరాడ్  కంపెనీ తెలిపింది.

2017లో బారత్‌లో బైక్‌ల ఉత్పత్తి ప్రారంభించిన బీఎండబ్ల్యూ

2017లో భారత్‌లో వీటి ఉత్పత్తిని బీఎండబ్ల్యూ మోటరాడ్  కంపెనీ ప్రారంభించింది. 2018 చివరి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు మోడళ్ల బైక్‌లు 24,363 యూనిట్లు అమ్ముడు పోయాయి. గత ఏడాదిలో దేశీయంగా మొత్తం 2,187 మోటార్‌సైకిళ్లను కంపెనీ విక్రయించింది. ఇదేకాలంలో ప్రపంచవ్యాప్తంగా 1,65,566 బైకులను విక్రయించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios