అందరూ ఉన్నప్పుడు వీరు ఎక్కువగా సిగ్గుపడతారు. అందరి ముందు రొమాన్స్ చేయడం ఈ రాశివారికి అస్సలు నచ్చదు. ఆ పని చేయరుకూడా. 

ప్రపంచం ముందు తమ ప్రేమను తమ భాగస్వామికి తెలియజేయాలనే ఆలోచనను కొంతమంది ఇష్టపడితే, కొంతమంది దానిని పూర్తిగా ద్వేషిస్తారు. అందరూ చూస్తుండగా రొమాన్స్ చేయడం కొందరికి అస్సలు నచ్చదు. రొమాన్స్ ని వారు ఒక ప్రైవేట్ గా భావిస్తారు. ఇతరుల ముందు తమ భాగస్వామితో సన్నిహితంగా ఉండటం కూడా వీరికి నచ్చదు. జోతిష్యశాస్త్రం ప్రకారం అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం...

 1.వృషభం

వారు ఆప్యాయంగా ఉండటానికి ఇష్టపడతారు, కానీ ఎప్పుడూ బహిరంగంగా ఉండరు. వారు పబ్లిక్‌లో తమ ఇమేజ్ గురించి చాలా ఆందోళన చెందుతుంటారు. అందరూ ఉన్నప్పుడు వీరు ఎక్కువగా సిగ్గుపడతారు. అందరి ముందు రొమాన్స్ చేయడం ఈ రాశివారికి అస్సలు నచ్చదు. ఆ పని చేయరుకూడా.

2.కన్య
ఈ రాశివారికి కాస్త సిగ్గు ఎక్కువ. అందరి ముందు రొమాంటిక్ గా ఉండటం వీరికి నచ్చదు. వీరిలో పరికితనం కూడా కాస్త ఎక్కువ అనే చెప్పొచ్చు. ఎవరైనా తమను గమనిస్తున్నారు అంటే చాలు.. వీరు ముడిచుకుపోతారు. 

3.వృశ్చికరాశి

ఈ రాశివారు అన్ని విషయాలను ప్రైవేట్‌గా ఉండటానికి ఇష్టపడతారు, ముఖ్యంగా సంబంధాల విషయానికి వస్తే. వారు తమ సంబంధాలను ప్రజల ముందు ప్రదర్శించడానికి ఇష్టపడరు. వారు ప్రజల ముందు తమ మనసులోని విషయాలను తెలపడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. 

4.మకర రాశి...

ఈ రాశివారు నీతి, నియమాలు, నైతికతకు ఎక్కువగా కట్టుబడి ఉంటారు. వారు తమ సంబంధాన్ని ప్రజల ముందు ప్రదర్శించడం చాలా అసౌకర్యంగా భావిస్తారు. వారు శృంగారాన్ని తలుపు వెనుక ఉంచడానికి మాత్రమే ఇష్టపడతారు.

5.కుంభరాశి..
కుంభ రాశివారికి సిగ్గు చాలా ఎక్కువ. వారు తమ సంబంధాన్ని ప్రైవేట్‌గా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. వారు తమ భాగస్వామి పట్ల బహిరంగంగా ఆప్యాయత చూపలేరు, ఎందుకంటే అది భయాన్ని కలిగిస్తుంది.

ఇక మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మీనం వంటి రాశులు పబ్లిక్ రొమాన్స్ ని ఇష్టపడతారు. వారు తమ సంబంధాన్ని ప్రజల ముందు చూపించడాన్ని ఇష్టపడతారు.వారి భాగస్వామి పట్ల ఎల్లప్పుడూ విస్మయం కలిగి ఉంటారు. వారు తమ భాగస్వామిని కూడా అందరికీ చూపించడానికి ఇష్టపడతారు.