Asianet News TeluguAsianet News Telugu

మీ రాశి ప్రకారం.. గత జన్మలో మీరేంటో చెప్పేయవచ్చు..!

గత జన్మలో సైంటిస్ట్  లేదంటే.. టూర్ గైడ్  లేదంటే... మీడియా పర్సన్ అయ్యి ఉండొచ్చు.
 

Who you were in Your past life based on Your zodiac sign
Author
First Published Sep 23, 2022, 10:47 AM IST

1.మేష రాశి..
మేష రాశి వారు గత జన్మలో వారియర్స్, ఫైటర్స్ అయ్యి ఉండి ఉంటారు. వీరు.. ఆయుధాలు చేతపట్టి.. యుద్ధాల్లో పాల్గొని ఉండి ఉంటారు.

2.వృషభ రాశి..
వృషభ రాశివారు... గత జన్మలో వ్యాపారి, ఆర్టిస్ట్ అయ్యి ఉండి ఉండొచ్చు. ఈ రాశివారు తాము వేసిన బొమ్మలను అమ్ముకొని ఉండి ఉంటారు.

3.మిథున రాశి..
మిథున రాశివారు గత జన్మలో సైంటిస్ట్  లేదంటే.. టూర్ గైడ్  లేదంటే... మీడియా పర్సన్ అయ్యి ఉండొచ్చు.

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు గత జన్మలో రైటర్ అయ్యి ఉండొచ్చు. వీళ్లు... చాలా ప్యాషన్ తో కవితలు, పుస్తకాలు రాసి ఉండొచ్చు.

5.సింహ రాశి..
సింహ రాశి వారు గత జన్మలో రాజకుటుంబానికి చెందిన వారు అయ్యి ఉండొచ్చు. లేదంటే... రాజ కుటుంబంలో పని చేసి ఉండొచ్చు.

6.కన్య రాశి...
కన్య రాశివారు గత జన్మలో ఏదైనా కొత్త వస్తువను కనిపెట్టినవారు అయినా అయ్యి ఉండాలి. లేదంటే.. అత్యంత శక్తులు ఎక్కువగా ఉన్నవారైనా అయ్యి ఉండాలి. బాగా తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారై ఉండొచ్చు.

7.తుల రాశి..
తుల రాశివారు గత జన్మలో చాలా డిప్లమాటిక్ గా ఉండటం లేదంటే... ఇతరులను జడ్జ్ చేయడం లాంటివి చేసి ఉండొచ్చు.

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు  గత జన్మలో.... సైంటిస్ట్ గా చేసి ఉండొచ్చు. లేదంటే... ఏదైనా ముఖ్యమైన పనిలో టాప్ సీక్రెట్ మిషిన్ కోసం పనిచేసి ఉండొచ్చు.

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు ఆర్కిటెక్ట్ లేదంటే ఏదైనా ట్రావెల్ ఏజెంట్ గానో పని చేసి ఉండొచ్చు. లేదంటే ఏదైనా మిషినరీ కోసం పని చేసి ఉండొచ్చు.

10.మకర రాశి..
మకర రాశివారిలో నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ. కాగా.... ఈ రాశివారు గత జన్మలోనూ నాయకుడు అయ్యి ఉండొచ్చు.

11.కుంభ రాశి..
కుంభ రాశివారు గత జన్మలో సోషల్ వర్కర్ అయ్యి ఉండొచ్చు. లేదంటే... ఏదైనా యాక్టివిస్ట్, లేదంటే నటులు అయ్యి ఉండొచ్చు.

12.మీన రాశి..
మీన రాశివారు  గత జన్మలో ఏదైనా ఫిలాసఫర్ లేదంటే... బోధకుడు అయ్యి ఉండి ఉండొచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios