కొత్తగా వివాహం అయిన లేక వివాహం అయి శ్రావణమాసంలో వరలక్ష్మివ్రతం చేయవారు, శ్రావణ మంగళవారం నోము పట్టనివారు ఈ సంవత్సరంలో వరలక్ష్మీవ్రతం కాని మంగళవారం నోములు కాని మొదలుపెట్టవచ్చా అంటే పెట్టకూడదు.

మూఢమిలో కాని సింహస్థగురు సమయంలోకాని కొత్తగా ఆచరించే మంగళగౌరీ వ్రతాలు, మరియు వరలక్ష్మీవ్రతాలు పనికారావు.

మొదటి సంవత్సరం అనే ప్రస్తావనే ముహూర్తదర్పణంలో లేదు. ఆరంభ ఉద్యాపనలు ప్రధానం. ఆరంభ ఉద్యాపనలకు ఎలాటి దోషాలు లేకుండా చూసుకోవాలి. మూఢమి మాత్రమే కాదు. మూఢమి పూర్తి అయిన తరువాత శుక్ర, గురు గ్రహాలు బాల్యావస్థలలో వృద్ధావస్థలలో ఉన్నపుడు ఏ వ్రతాలు ఆచరించడం పనికిరాదు. చతుర్వర్గ చింతామణి, హేమాద్రి మొదలైన వాిల్లో వివరణ ఉంది.

కొంతమంది కొన్ని గ్రంథాలలో మొదటిసారి ఆచరించే వారి విషయంలో ఏ వ్రతాలైనా ఆచరించవచ్చు అని చెప్పారు. కాని చాలా వరకు ఉన్న గ్రంథాల్లో ఈ విషయంలో పూర్తి వివరణలు ఉన్నాయి. ఒక్క వ్రతాలే కాదు. మొదటి ఎవరైనా విశేషమైన దేవతా యాత్రలు, క్షేత్ర దర్శనాలు చేయడం కూడా ఈ సమయంలో పనికిరాదు. ఇవి ఒకటే కాదు. ఏ మంచి పని చేయాలనుకున్నా ఈ మూఢమి సమయంలో దాని ఫలితం అంతగా రాదు అని చెప్పబడుతుంది. కావున మొదటి సారి చేసే ఏ పూజలు ఈ శ్రావణమాసంలో చేయకపోవడంమంచిది.

అభీష్ట సిద్ధికి ఆశాదశమి వ్రతం : శ్రావణమాసంలో వచ్చే శుద్ధ దశమి ప్రతివారి ఆశలను నెరవేర్చే శక్తివంతమైన తిథి. అందుకే ఈ తిథిని ఆశాదశమి అన్నారు. జీవితంలో మనకు ఏమేమి కావాలో ఒక్కోసారి మనకే తెలియదు. మనకు తెలిసిన తెలియని విషయాలు అమ్మవారికి అన్నీ తెలుస్తాయి. మనకు జీవితంలో అప్పికి ఏది అవసరమో అది మాత్రమే మనకు తెలుసు. దానిని మాత్రమే కోరుకుంటాం. తరువాత మళ్ళీ వేరేవి కావాలని కోరుకుంటాం. కాని అన్ని సమయాల్లో ఈ ఆశాదశమి ఉండదు. కనుక ఆ సమయంలో ప్రతీవారు పూజలు చేసుకొని అమ్మవారిని ప్రార్థించడం మంచిది.

ఈసారి ఈ ఆశాదశమి శుక్రవారం ఆగస్టు 9వ తేదీన వస్తుంది. ఈ రోజు వరలక్ష్మీవ్రతం, చేయనివారు, అయ్యో అమ్మవారిని పూజించలేదే అనుకునేవారు ఈ పూజను చేసుకోవచ్చు. ఈ దశమి రోజున సాయంకాలం అమ్మవారిని ఆరాధించాలి.  ఉదయం వరలక్ష్మీవ్రతం, అమ్మవారి పూజ చేసుకొని సాయంకాలం ఈ పూజ చేయాలి. ఈరోజు దశమి సాయంకాలం వ్యాప్తి ఉన్నది కావున ఈ పూజను సాయంకాల వేళలో అందరూ చేసుకోవచ్చు. మాములు అమ్మవారి పూజ చేసినట్లుగానే ఈ పూజ చేయాలి.

ఈ రోజున అన్నపూర్ణాష్టకాన్ని పించాలి.

భక్తాభీష్టకరి సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ, భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ అంటూ అన్నపూర్ణాదేవిని ప్రార్థన చేయాలి.

అవకాశం, వీలు వున్న ఉన్నవాళ్ళందరూ కూడా మొత్తం అన్నపూర్ణాష్టకం పఠించడం మంచిది. ఊరికే చదవడం మాత్రమే కాకుండా భక్తి విశ్వాసాలతో అమ్మపై దయ ఉంచండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. మనసును అమ్మపై పెట్టి ఏ పూజ చేసినా వ్రతం చేసినా ఫలిస్తాయి....

శ్రీమాత్రేనమః.

డా.ఎస్.ప్రతిభ