ఈ యేటి చివరి సూర్య గ్రహణం డిసెంబర్ 14న రాబోతోంది. ఈ సూర్యగ్రహణం భారత్ లో ఐదుగంటలపాటు ఉంటుంది. సోలార్ ఎక్ లిప్స్ 2020 భారత్ లో ఉదయం 7.03 నిమిషాలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.23 నిమిషాలకు పూర్తవుతుంది. 

2020లో మొదటి సూర్య గ్రహనం జూన్ 21న సంభవించింది. సూర్యగ్రహణం మన గ్రహస్థితిగతులను మారుస్తుందని నమ్ముతారు. సూర్యగ్రహణం మనిషి జీవితం మీద ప్రభావం చూపిస్తుందని జాతకకారులు చెబుతుంటారు.

డిసెంబర్ 14న రాబోయేది 2020లో చివరి సూర్యగ్రహణం. ఇది దక్షణాఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో,  పసిపిక్ సముద్రంలో కనిపించనుంది. ఇక పూర్తిస్థాయి సూర్యగ్రహణం చిలిలో కనిపిస్తుంది. అర్జెంటినాలోని కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం పూర్తిగా కనిపించే అవకాశం ఉంది. 

సౌతర్న్ సౌత్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో, సౌత్ వెస్ట్ ఆఫ్రికా, అంటార్కిటికాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. అది కూడా వాతావరణం అనుకూలిస్తేనే.