మనిషిగా ప్టుట్టిననందుకు ఏమి సాధించాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాని అందరూ అనుకుంటూ ఉంటారు మోక్షం సాధించడం మాత్రమే లక్ష్యం అని. మోక్షం కూడా ఒక కోరిక కాదా? అసలు ఈ భూమి మీదకు వచ్చి నందుకు ఏ కోరిక లేకుండా ఉండే ప్రయత్నం చేయడం మాత్రమే పని. మిగతా లక్ష్యాలకంటే మోక్షం సాధించాలనే లక్ష్యం కొంత వరకు సమంజసమైనదే. కాని ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అది కూడా ఉండకూడదు.

వ్యక్తి ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, అతని వెనక కూడా ఎవరూ తిట్టుకోకుండా ఉండాలి. మనిషి జీవించి ఉన్నంత వరకే కాదు, వారు పోయిన తర్వాత కూడా వారిని గుర్తు చేసుకునే స్థాయికి ఎదగాలి. సంతానం ఉన్నవారు సంవత్సరానికి ఒకసారి ఆబ్దికాలు పెడతారు కదా ఆ ఒక్కరోజు గుర్తు చేసుకుటాంరు అనుకుటారు. కాని ఉన్న సంతానంలో కూడా ఎంత మంది పిల్లలు తమ తల్లితండ్రులను గుర్తుంచుకుటాంరు. మరి సంతానం లేనివారు కాని, మగపిల్లలు లేనివారు కాని ఏమి చేయాలి? దీనికి పరిష్కారం ఏమి?

పుణ్యంకొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అనే సామెత పూర్వకాలం నుంచి వస్తుంది. అనగా ఎవరైనా పుణ్యకార్యాలు ఎక్కువగా చేసినవారికి వారి జీవిత భాగస్వామి భార్య / భర్త అనుకూల వంతులు అవుతారు. దానాలు ఎంత ఎక్కువ చేస్తే ఉంటే పుట్టబోయే, ప్టుట్టిన, పుట్టే సంతానం అనుకూలంగా ఉంటారు. అనుకూలంగా అంటే వారికి అనుకూలంగా తల్లితండ్రులు ఉంటారు. తల్లితండ్రులకు అనుకూలంగా పిల్లలు ఉంటారు. ఏ రకమైన వ్యతిరేక ఆలోచనలు లేకుండా ఉంటారని అర్థం.

తమ కడుపున ప్టుట్టినన పిల్లలు మాత్రమే సంతానం అనుకోకూడదు. తమకు చేతనైన సహాయం అందరికీ చేస్తూ పదిమందిలో నాలుకలాగ ఉండాలి. సప్త సంతానాలు అని 7 రకాల పనులను అంటారు.

1. చెరువులు తవ్వించడం, 2. బావులు తోడించడం, 4. ఉద్యానవనాలు పెంచడం, 5. అందరికీ ఉపయోగపడే కల్యాణమండలపాలు కట్టించడం, 6. జలాశయాలు నిర్మించడం, 7. సద్ధర్మాచణ చేయడం, 8. అగ్రహారాలను దత్తత చేసుకోవడం. వీట్టినని సప్త సంతానాలు అంటారు.

సంతానం అనేది కావాలనుకోవడం ఎందుకు అంటే తమ తర్వాత తమ వంశగౌరవం కాని, తమ వారసత్వం కాని తమ పేరు కాని నిలిచి ఉండాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రస్తుతకాలంలో ప్టుట్టినన సంతానం ఎంతవరకు ఎవరి మాట ఎవరు వింటున్నారో ఎవరికి వారికే తెలుస్తుంది. సంతానం మాట వినడం లేదు అంటే దానికి తల్లితండ్రులు పిల్లలు కూడా కారణం అవుతారు. కాబ్టి అలా బాధపడకుండా ఈ పనులు చేయడం వలన తమ కుటుంబంలోని వారే కాకుండా  కొన్ని వందలు, వేలు, లక్షల మంది గుర్తుంచుకుటాంరు. వీట్టిన వలన చాలామందికి జీవనోపాధి కూడా దొరుకుతుంది.

కొన్ని తరాల వరకు తమ వంశగౌరవం, పేరు ప్రతిష్టలు నిలిచి ఉండిపోతాయి. కాబి ఎవరిక తోచినంత వారు ఈ మంచి పనులలో భాగంకావాలి. ఉద్యానవనాలు పెట్టడం అంటే మనమే అక్కడికి వెళ్ళి ఉద్యానవనాలు నిర్మించనక్కరలేదు. ఉద్యానవనాలు కాపాడేవారికి సహాయం చేసినా సరిపోతుంది. అది కూడా పర్యావరణాన్ని కాపాడటమే అవుతుంది. ఆ పర్యావరణాన్ని కాపాడడమే తమకు పుణ్యంగా మారుతుంది.

ఆ చెరువులు బావులు, మండపాలు, ఉద్యానవనాలు ఉన్నంత వరకు వీరికి మరుజన్మ ఉండదు. అందరూ కోరుకునే మోక్షం కూడా ఇక్కడ లభిస్తుంది.

డా.ఎస్.ప్రతిభ