వార ఫలాలు: ఓ రాశివారికి ఈ వారంలో ఉద్యోగయత్నాలు కలసివస్తాయి

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారు ఈ వారం  కుటుంబముంలో మీ బాధ్యతలను సక్రమంగా సక్రమంగా నిర్వహిస్తారు. వివాదాస్పదమైన విషయాలకు దూరంగా ఉండటం మంచిది.

Weekly Horoscope of 19th February to 25th February 2023

వార ఫలాలు : 19 ఫిబ్రవరి 2023 నుంచి 25  ఫిబ్రవరి  2023 వరకు
 
 
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)


 
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన వారములు॥ ఆది గురు శుక్ర
అనుకూలమైన తేదీలు      ॥ 3-6-9
సంతోషకరమైన వార్తలు వింటారు.సమాజంలో మీ మీద జనాలకు సదాభిప్రాయం ఏర్పడుతుంది. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ప్రయత్నించిన కార్యాలు పూర్తవుతాయి. బంధుమిత్రదులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త పరిచయాలు అభివృద్ధికి సహకరిస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు ప్రయాణాలు కలిసి వచ్చును. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు. అభివృద్ధి కార్యక్రమాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. వారాంతంలో ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడును. ఆరోగ్య సమస్యలు తలెత్తును.


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన వారములు॥ ఆది -గురు -శుక్ర
అనుకూలమైన తేదీలు      ॥ 3-9-12
కొన్ని కీలకమైన సమస్యలలో విజయం సాధిస్తారు. సమాజము లో  పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. స్థిరాస్తి అభివృద్ధి విషయాలు అనుకూలిస్తాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉండును. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉండును. కుటుంబముంలో మీ బాధ్యతలను సక్రమంగా సక్రమంగా నిర్వహిస్తారు. వివాదాస్పదమైన విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఒక సమస్య పరిష్కారం అగును. వృత్తి వ్యాపారము లో మంచి లాభాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేయువారు ప్రయత్నాల ఫలించును. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. వారాంతంలో శారీరక బాధలు ఏర్పడతాయి. బంధుమిత్రులతోటి విరోధాలు రాగలవు. అనవసరమైన ఖర్చులు. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రావచ్చును.

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన వారములు॥ ఆది- గురు -శుక్ర
అనుకూలమైన తేదీలు      ॥ 5-6-9
అన్ని విషయాల్లో  ఓపిక శ్రద్ధ తోటి చేయాలి. ఉద్యోగంలో అధికారుల తో సఖ్యతగా ఉండాలి. ఆచితూచి మాట్లాడుట మంచిది. కుటుంబ సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారములో సామాన్య లాభాలు లభిస్తాయి.  అనుకోని అపవాదములు ఏర్పడగలవు. తలపెట్టిన కార్యక్రమాలలో ఆటంకములు కలుగుతాయి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఇతరులకు సహాయ సహకారాలు మధ్యవర్తత్వం వహించడంలో జాగ్రత్తగా ఉండవలెను. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించకూడదు ‌. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు రావచ్చు. వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంతో గడుపుతారు. వ్యాపారం నందు ఊహించని విధంగా ధనం లభిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
అనుకూలమైన తేదీలు      ॥ 1-2-4-7
జీవిత భాగస్వామి తో చికాకులు రాకుండా సఖ్యతగా ఉండాలి. ఉద్యోగంలో అధికారుల కోపానికి గురికావలసి వస్తుంది. విద్యార్థులు శ్రద్ధతో చదవగలిగే ఉత్తీర్ణత సాధిస్తారు. ఇంట్ో అనవసరమైన కలహాలు ఏర్పడడం వలన మానసిక ఆందోళన ఏర్పడను. వ్యవహార లోపము వలన ప్రారంభించిన కార్యకలాపాల్లో ఆటంకాలు ఏర్పడి  చిరాకు పుట్టించును. ఇతరులతోటి వాగ్వాదములు కలహాలకు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. పుత్ర పుత్రికాదులతో సమస్యలు ఏర్పడను. వృత్తి వ్యాపారములలో సామాన్యమైన లాభము పొందవచ్చు. నమ్మిన వారి వలన నష్టం ఏర్పడుతుంది. వృదా ప్రయాసాలకు లోను అవుతారు. అనుకోని పరిణామాలు వలనమానసిక ఉద్రేకతలు మానసిక వేదన ఏర్పడతాయి. కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి. వారాంతంలో ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నమ్మిన వారి వలన మోసపోవచ్చును. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవలెను.

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
అనుకూలమైన తేదీలు      ॥ 2-4-7
మీ శక్తి సామర్ధ్యాలు లకు శ్రమకు తగిన ప్రతిఫలం గుర్తింపు లభిస్తుంది. గతంలో చేసిన రుణాలు తీరి ప్రశాంతత లభిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారము నందు ఊహించని ధన లాభం కలుగుతుంది. సంతాన కుటుంబ అభివృద్ధి అన్ని విధాల బాగుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు నశించి ఉపశమనం లభిస్తుంది. రావలసిన పాత బాకీలు వసూలు అగును. కేసులు వివాదాలు పరిష్కారాలు లభిస్తాయి. సమాజం నందు సంఘటనల వలన అనుకోని విధంగా మీకు లాభం చేకూరుతుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు. విందు
బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో ఆనందంగా గడుపుతారు. వారాంతంలో ఇతరులతోటి కలహాలకు విరోధాలకు దూరంగా ఉండవలెను. దూరపు ప్రయాణం చేయవలసి వస్తుంది. సంతానం తోటి కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది.

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం
అనుకూలమైన తేదీలు      ॥ 3-5-9
ఆగిపోయిన పనులు ప్రారంభం కాగలవు. విశేష కార్యాలు సాధిస్తారు. సమస్యలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందుతారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించును. ఆకస్మికంగా రావలసిన బాకీలు వసూలు అగును. విలాసవంతమైన  చిత్ర విచిత్రమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో సంతోషాన్ని సంతృప్తిని పొందుతారు. విందు వినోదాలు తో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. సమాజము లో ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి. మీ ప్రత్యర్ధులు పై పైచేయి సాధిస్తారు. మిత్రుల ః సహాయ సహకారాలు లభిస్తాయి. వారాంతంలో కొన్ని విషయాలు వలన బాధ కలుగును. ఖర్చులు అదుపులో ఉంచుకొని వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలి. ఆకస్మిక పరిణామాలు ఆందోళన కలిగిస్తాయి.

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర
అనుకూలమైన తేదీలు      ॥ 3-9-12
చేసే పనుల్లో  ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ పట్టుదల తోటి వ్యవహారాన్ని చక్కపెట్టాలి. చెడు పనులకు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. గృహ నిర్మాణ క్రయవిక్రయాలు వాయిదా పడతాయి. బందు వర్గము తో మనస్పర్ధలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. సంఘములో మీ మాటకు విలువ తగ్గును. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. రుణ శత్రుపీడలు అధికంగా నుండును. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రము గా నుండును. కొన్ని సంఘటనలు వలన మానసికంగా బాధపడతారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తగిన సమయానికి ఏదో విధంగా ధనం చేకూరును. వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకొనవలెను. ఆర్థికంగా కొంతమేర రుణాలు చేయవలసి వస్తుంది . వారాంతంలో సమాజములో  ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం ఏర్పడుతుంది. బంధుమిత్రుల తోటి కలిసి ఆనందంగా గడుపుతారు.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
అనుకూలమైన తేదీలు      ॥ 3-6-9
చేయు వ్యవహారంలో చాకచక్యంగా వ్యవహరించి పూర్తి చేయాలి. బంధువులతో చికాకులు మాట పట్టింపులు ఏర్పడగలవు. కొన్ని సమస్యల విషయంలో రాజీపడడం మంచిది. జీవిత భాగస్వామి తో సఖ్యతగా మెలగవలెను. ఆరోగ్యం విషయంలో అలసత్వం వహించకూడదు. కలహాలకు  దూరంగా ఉండటం మంచిది.  సమాజమంలో అపవాదములు ఏర్పడగలవు. స్థిరాస్తి విషయంలో తగాదాలు రావచ్చు. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగ్గ లాభం దొరకడం కష్టంగా ఉండును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మనస్సులో భయముగా ఉంటుంది. రావలసిన ధనము చేతికి అందక మానసిక అశాంతి  ఏర్పడుతుంది . వారాంతంలో ఆరోగ్య ప్రశాంతత లభిస్తుంది.  మిత్రుల  సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సంతాన సౌఖ్యం లభించును.


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళ
అనుకూలమైన తేదీలు      ॥ 3-6-9-12
గృహమునందు శుభకార్యాలు జరుగును.సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన ఉత్తేజం తోటి ముందుకు వెళ్తారు. ప్రభుత్వ సంబంధిత పనులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. గృహ నిర్మాణ పనులు సజావుగా రావలసిన బాకీలు ఆటంకాలు ఏర్పడిన చివరకు వసూలు అగును. ఉద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఎటువంటి నూతన కార్యక్రమాలు తలపెట్టిన  విజయవంతం అగును. సమస్యలు తీరి జీవనం సౌఖ్యంగా గడుస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. వారాంతంలో ఇష్టం లేని పనులు చేయవలసి వస్తుంది. పనుల్లో అలసత్వం వహిస్తారు. వ్యవహారం అంతా తికమకగా ఉండును.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
అనుకూలమైన తేదీలు      ॥ 2-3-6-7
శారీరకముగా ఒత్తిడి గా ఉంటుంది. ప్రతి పనిలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయానికి మించి అనవసరమైన ఖర్చులు చేయకూడదు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనివలెను.  గృహములో ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొనుట మంచిది. రుణ శత్రువాదులు వలన మానసికంగా బాధపడతారు. సమాజము లో మీ మాటకు విలువ తగ్గును. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగముంలో అధికారుల  ఒత్తిడిలు పెరుగును. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. వారాంతంలో జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
అనుకూలమైన తేదీలు      ॥ 2-3-6-7
జీవితం ఆనందంగా గడుపుతారు. మిత్రుల ఆదరణ అభిమానాలు పొందగలరు. వృత్తి వ్యాపారంలో అభివృద్ధి కనబరుస్తారు. జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగములో అధికార అనుగ్రహము కలదు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉండును. వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన కుటుంబ వృద్ధి కలుగుతుంది. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కోర్టు కేసులు అనుకూలమైన తీర్పులు రావచ్చును. వారాంతంలో అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సమాజములో  అపవాదములు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకొని వలెను.

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ
అనుకూలమైన తేదీలు      ॥ 6-7-9-1
పాత విషయాలు సంబంధించిన వివాదాలు తిరిగి పునరావృతం అవుతాయి. కొన్ని సమస్యల విషయంలో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. సమాజము లో మీ మీద వ్యతిరేకత వ్యాఖ్యానాలు చేస్తారు. ఇతరుల  విషయాలలో మధ్యవర్తిత్వం ఉండడం అంత మంచిది కాదు. ఆదాయానికి మించి ఖర్చులు   చేస్తారు. జాగ్రత్త అవసరము. మానసికంగా గందరగోళం గా ఉండును. ఇంటా బయటా ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగము పట్ల అనాసక్తిగా వ్యవహరిస్తారు. అకారణంగా వివాదాలు ఏర్పడగలవు. వారాంతంలో శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అనుకోని ధనలాభం కలుగును.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios