Asianet News TeluguAsianet News Telugu

వారఫలితాలు తేదీ 15 అక్టోబర్ శుక్రవారం నుండి 21 గురువారం 2021

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం అదనపు ఆదాయం సమకూరుతుంది. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు.

weekly horoscope 15th cotober to 21st october 2021
Author
Hyderabad, First Published Oct 15, 2021, 5:40 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం రావలసిన సొమ్ము అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వాహన, గృహయోగాలు.  ప్రత్యర్థులను సైతం అనుకూలురుగా మార్చుకుంటారు. ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. దీక్షతో ముందుకు సాగి విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలం. వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. లాభాలు తథ్యం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్య, కుటుంబసమస్యలు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం అదనపు ఆదాయం సమకూరుతుంది. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో  పనిభారం మరింత తగ్గుతుంది. కళాకారులకు అన్ని విధాలా అనుకూలం.  వారం మధ్యలో బంధువిరోధాలు. పనిఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం అనుకున్న ఆదాయం లభించి ముందడుగు వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖ వ్యక్తులు పరిచయం. అందరిలోనూ మీ ప్రత్యేకత చాటుకుంటారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. భూవివాదాలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగాలలో విధులు ప్రశాంతంగా సాగుతాయి.  రాజకీయవర్గాలకు ఊహించని పదవులు. వారం చివరిలో అనారోగ్య సూచనలు. శ్రమాధిక్యం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థుల శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. ఇంట్లో శుభకార్యాలపై చర్చలు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు లాభాలబాట పడతారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం.  రాజకీయవర్గాలకు కొన్ని విజయాలు వరిస్తాయి. వారం చివరిలో బంధువులతో తగాదాలు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం అనుకున్న లక్షాలను సాధిస్తారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. సేవాకార్యక్రమాలపై దృష్టి పెడతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు సమకూర్చుకుంటారు. ఇంట్లో శుభకార్యాల సందడి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో ధననష్టం. అనారోగ్య సూచనలు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం రావలసిన డబ్బు అంది ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాలలో విజయం. ఆప్తులతో వివాదాలు తీరతాయి. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో  ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఊహించని అవకాశాలు.  వారం మధ్యలో బంధువులతో కలహాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం అవసరాలకు డబ్బు అందక ఇబ్బందులు ఎదురైనా అధిగిస్తారు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు. కాంట్రాక్టర్లు నిరాశ చెందుతారు. సన్నిహితులు వ్యవహారాలలో ఒత్తిడులు పెంచుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థులు కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలలో  ఆశించిన లాభాలు దక్కక నిరుత్సాహం. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులు, విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. స్థిరాస్తి విషయంలో ఒత్తిడులు తొలగుతాయి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలను అధిగమిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో అనారోగ్యం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి సహాయం అందుతుంది. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగుపడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారాలు లాభాలదిశగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాల శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో మిత్రులతో విభేదాలు. అనుకోని ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలు సానుకూలమవుతాయి. విద్యార్థులకు భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. వ్యాపారాలు సమయానికి విస్తరిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో మానసిక ఆందోళన. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల రాకతో ఉత్సాహంగా గడుపుతారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొన్ని ముఖ్య సమావేశాలకు హాజరవుతారు. ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారాలలో సమస్యలు, చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక ఆందోళన. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. గతం నుంచి వెంటాడుతున్న కొన్ని సమస్యలు తీరతాయి. పలుకుబడి పెరుగుతుంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.  పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. కళారంగం వారికి అనూహ్యమైన అవకాశాలు దక్కవచ్చు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios