జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) 

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం

 మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
మనసునందు ఆందోళనగా ఉంటుంది .తలపెట్టిన పనులు పూర్తి గాక చిరాకు పుట్టించును.వచ్ఛిన ప్రతి అవకాశామును అందుపుచ్చుకొనవలెను. దాంపత్య జీవితంలో మనస్పర్ధలు ఏర్పడతాయి. దైవ కార్యములు లో పాల్గొంటారు. ప్రయాణమునందు తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. సంఘము నందు గౌరవం తగ్గుతుంది. ఉద్యోగ ప్రయత్నాలులలో అవరోధములు ఏర్పడతాయి.రుణ రోగబాధలు పెరిగి మానసిక ఒత్తిడి పెరుగును. చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రతి విషయంలో వ్యతిరేకతలు ఏర్పడతాయి. సంతాన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. పూర్తి వ్యాపారం నందు శ్రమకు తగిన ప్రతిఫలం కనిపించదు.తొందరపాటు మాటల వలన కొన్ని కొత్త సమస్యలు తలెత్తుతాయి. వారాంతం లో తలపెట్టిన పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. బంధుమిత్రుల యొక్క కలయక. సంతోషకరమైన వార్తలు వింటారు.

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
బంధుమిత్రులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. ప్రయత్న కార్యములు యందు బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడవచ్చు.ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలచే ఉపకారములు పొందగలరు.. కుటుంబమునందు గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో సామాన్య లాభాలను పొందుతారు.భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలకు వాయిదా పడతాయి. ఉద్యోగం నందు పై అధికారుల ఒత్తిడి పెరుగును. విద్యార్థులు చదవనందు శ్రద్ధ తీసుకోవలెను. అవసరములకు తగినట్లుగా ఆదాయములు ఉండును. ఇతరులతోటి వాదనలకు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాగలవు. వారాంతం లో ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
తలపెట్టిన కార్యములలో విజయం చేయకూరును. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ప్రతి చిన్నఅవకాశాలను సద్వినియోగం చేసుకొనవలెను. మానసికంగా శారీరకంగా బలపడతారు . ఎలాంటి సమస్యలనునైనా ధైర్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ వృద్ది కొరకు కొన్నినిర్ణయాలు తీసుకుంటారు. గృహ నిర్మాణ పనులు ముందుకు సాగుతాయి. పెద్దవారి స్నేహాల వలన లాభం చేకూరుతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు పొందగలరు. నూతన వస్తు వాహనాది కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించవలెను. మీ ప్రతిభ సామర్ధ్యాలు సమాజం గుర్తించును. వృత్తి వ్యాపారము నందు మంచి లాభాలు లభిస్తాయి. వారాంతం లో మనసునందు భయంగా ఉండుట. సమాజం నందు అవమానాలు కలుగుట. చేయ వ్యవహారము నందు తికమక గా ఉంటుంది.


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఆదాయానికి మించి అధిక ఖర్చులుపెరుగును. ఇంటా బయట ప్రతికూల వాతావరణ ఏర్పడుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం కష్టంగా చేయ పనులలో శ్రమ ఎక్కువగా ఉండను. అనుకోని సమస్యలు ఏర్పడి మానసిక ఒత్తిడి పెరుగును. బంధువులతో అనవసరమైన గొడవలు రావొచ్చు. ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. మనస్సునందు ఆందోళనగా ఉంటుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ప్రయాణాలు యందు జాగ్రత్త అవసరం. సమాజంలో అపవాదములు ఏర్పడగలవు. తలపెట్టిన పనులలో ఊహించని ఆటంకాలు ఏర్పడును. ఉద్యోగం నందు అధికారులతోటివిరోధాలు ఏర్పడతాయి. కీలకమైన సమస్యలు మానసిక వేదనకు దారి తీయను. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన ఖర్చుల ఆందోళన కలిగిస్తాయి. వారాంతం లో ప్రతి విషయం అనుకూలించును. ఆగిపోయినప్పుడు పనులు పూర్తి కాగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు.

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
సంఘవనందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆరోగ్య సమస్యలు నుండి ప్రశాంతత లభించును. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. చేయ పనుల యందు కొన్ని ఆటంకాలు ఏర్పడిన చివరకు పూర్తి అగును. వ్యాపారములు క్రమక్రమంగా అభివృద్ధిలోకి వస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారములు లభించును. ఉద్యోగమునందు చికాకుల తీరి ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ముఖ్యమైన విషయాలలో విజయం సాధిస్తారు. వివాదాస్పదమైన విషయాలకు దూరంగా ఉండాలి. కుటుంబ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు. వారాంతం లో చేయు వ్యవహారము నందు బుద్ధి కుశలత తగ్గుతుంది. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు తొలగి ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలరు. ఉద్యోగం నందు చికాకులు సమస్యలు తొలుగును.

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
మీరంటే గిట్టుని వారితో ప్రమాదాలు పొంచి ఉన్నవి. ఉద్యోగమునందు ఒత్తిడి అధికంగా ఉంటుంది. సమస్యలు ఏర్పడగలవు. బందు మిత్రులతో మనస్పర్ధలు రావచ్చును. తలపెట్టిన పనులు పూర్తిగాక చికాకులు అధికమవుతాయి. ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. వృత్తి వ్యాపారములో సామాన్యంగా ఉంటాయి. దైవ కార్యములు లో పాల్గొంటారు. ప్రయాణనమునందు జాగ్రత్త అవసరము. సోదరుమూలక ఇబ్బందులు ఎదురవుగలవు. భూసంబంధిత వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. మిత్రులతోటే సఖ్యతగా మెలగవలెను. చేయు ఖర్చు యందు ఆచితూచి ఖర్చు చేయవలెను. అసూయ ద్వేషాలకు దూరంగా ఉండవలెను. ప్రతి విషయంలో ఆలోచించే నిర్ణయాలు తీసుకొనవలెను వారాంతం లో అనవసరమైన ఖర్చులు పెరుగును.. సమాజము నందు ప్రతికూలత వాతావరణం. అనవసరమైన కాలయాపన.

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ప్రారంభంలో ఆగిపోయిన పనులుపూర్తి చేస్తారు. ఉద్యోగమునందు అనుకోని అనుకూల మార్పులు అధికార వృద్ధి కలుగును. శుభకార్యాలలో పాల్గొంటారు. పొదుపు మార్గాలపై దృష్టి సారిస్తారు. కొత్త ఆలోచన కలిసి వస్తాయి. విద్యార్థులు పట్టుదలతో చదివిన పోటీపరీక్షలలో ఉత్తీర్ణ లగుతారు. వృత్తి వ్యాపారులు లాభ సాటిగా సాగును. శారీరక శ్రమ తగ్గి ప్రశాంతత లభించును. సంఘములో ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభించును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు . ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. ప్రతి విషయంలో ధైర్యంగా ముందడుగు వేస్తారు. ప్రభుత్వ సంబంధిత కార్యాలు పూర్తవుతాయి. ఎంతటి సమస్యలు వచ్చినా పరిష్కారం అవుతాయి. వారాంతం లో శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును. మిత్రుల యొక్క ఆదర అభిమానాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఉద్యోగమునందు చికాకుల తొలగి ప్రశాంతత లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభించును. వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి. దైవ కార్యములు ఆచరిస్తారు.ఓ దూరపు ప్రయాణనములు వలన లాభం కలుగుతుంది ‌. మీకు ఉపయోగపడే వ్యక్తులతో కొత్త ఆలోచనలు చర్చలు చేస్తారు. కుటుంబ సంబంధిత వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. భూ క్రయవిక్రయాల కలిసి వస్తాయి. సంఘములో ఉన్నత వ్యక్తులను కలుస్తారు. రాని బాకీలు వసూలగును. వారాంతం లో నష్టప్రదమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది.

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
అకాల కలహాలు కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది. శత్రువుల వలన కొన్ని ప్రమాదాలు ఏర్పడగలవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొనివలెను. కుటుంబమునందు కలహాలు ఏర్పడవచ్చు. సంతానముతో మృదువుగా ప్రవర్తించవలెను. ఉద్యోగమునందు పై అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడగలవు. తలపెట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేయవలెను. అనవసరమైన ఖర్చులు తగ్గించవలెను. వివాహాది ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడును. వృత్తి వ్యాపారం నందు అధిక శ్రమ ఏర్పడుతుంది. సమాజం నందు మీకంటే చిన్నవారి వలన అవమానవులు జరగవచ్చు. వాహన ప్రయాణాలయందు జాగ్రత్త అవసరం. మనసునందు లో లోపల భయాందోళనలు పెరుగును. వారాంతం లో సమాజం నందు ప్రజాభిమానం పొందగలరు. విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రభుత్వ సంబంధిత పనుల సజావుగా సాగును.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఉదర సంబంధితఆరోగ్య సమస్యలు రావచ్చు. ఆర్థిక సమస్యల పెరిగి అనేక సమస్యలకు దారితీయును. ఇంట బయట ప్రతికూల వాతావరణ ఏర్పడుతుంది. ఉద్యోగమునందు పని ఒత్తిడి పెరిగి చికాకుగా ఉండును. చేయి వ్యవహారములు తెలివితేటలతో పూర్తి చేయవలెను. జీవిత భాగస్వామితో కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడగలవు. వ్యాపారమునందు పెట్టుబడులు ఆచి తూచి అడుగ వేయవలెను. కుల వృత్తి లు చేయవారాలకు సామాన్యంగా ఉండును. గృహ నిర్మాణ క్రయవిక్రయాలు వాయిదా వేయటం మంచిది. నమ్మిన వారి వలన మోసం జరగవచ్చు. ఆర్థికంగా రుణములు చేయవలసి వస్తుంది. సమాజం నందు సంఘటనలు మానసిక ఉద్రేకతులకు దారితీయును. కుటుంబం నందు ప్రతికూలత ఉంటుంది. వారాంతం లో అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. గృహనందు ప్రశాంతత వాతావరణ నెలకొంటుంది. ఉద్యోగము నందు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు.

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
వృత్తి వ్యాపారములందు ఊహించని ధన లాభం కలుగును. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. మీ సహోద్యోగుల నుండి ఊహించని మద్దతు లభిస్తుంది. భూ గృహ నిర్మాణాలు అనుకూలించును. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడిన అధిగమిస్తారు. కొత్త ఆలోచనలకు శ్రీకారం చేస్తారు. నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు . చేయ పనులలో శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి. శుభ మూలకం గా ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రతి విషయంలోనూ ఎదురులేకుండా ముందుకు సాగు గలరు. కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి. సంతాన సౌఖ్యం పొందగలరు. చేయు ఖర్చు యందు ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను. వాహన ప్రయాణానందు జాగ్రత్త అవసరం.


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
గృహమునందు శుభకార్యములు జరుగును. కుటుంబమునందు ఆనందకరమైన వాతావరణం. సంఘములో ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభించును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారములు అందిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగమునందు అనుకోని అనుకూల మార్పులు రావచ్చును. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యములందు పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలించును. ప్రతిర్ధులపై పై చెయ్య సాధిస్తారు. వృత్తి వ్యాపారములు ఊహించినట్లే ధనలాభం అందుకుంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. వివాహాలు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎంతటి కార్యాన్నైనా అవలీలగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వారాంతం లో సంతానం గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సమస్యలు కొన్ని విషయాలు వినడం వలన మానసిక ఒత్తిడి పెరుగును.