డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

  ఆదాయం - 5,  వ్యయం - 5             రాజపూజ్యం - 3,      అవమానం - 3 

• వృశ్చికరాశి వారికి అష్టమంలో ఉన్న రాహువు, ద్వితీయంలో ఉన్న కేతువు, మూడింట శని ఉన్న ఫలితంగా 

• ఈ సంవత్సరంలో పట్టింది బంగారం అవుతున్నట్టు అదృష్టం అనుకూలంగా ఉంది.

• కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి.

• రాజకీయ నాయకులు, ప్రముఖులు అండగా ఉంటారు.

• ఉద్యోగపరంగా స్థాయి పెరుగుతుంది. 

• విద్యా సంబంధ విషయాలు సానుకూలపడతాయి. 

• విద్యాసంస్థలకు పేరుప్రఖ్యాతులు లభిస్తాయి.

• కొన్ని స్థిరాస్తులు కొంటారు. పలువిధంగా అభివృద్ధి చేస్తారు.  

• బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరమవుతారు.  

• రాజకీయ జీవితం బాగుంటుంది. పదవీప్రాప్తి. 

• ఆర్థికపురోగతికి నూతన వ్యాపారాలు ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకుంటారు.

• మీడియా వల్ల మేలు జరుగుతుంది. 

• సినిమా, ట్రావెల్స్‌, ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.
  
• ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి తెచ్చి రుజువు చేస్తారు. 
   
• న్యాయ పోరాటానికి కొన్ని విషయాలలో సిద్ధపడతారు. 

• వ్యాపారంలో నూతన శాఖలు నెలకొల్పుతారు.  

• కాంట్రాక్ట్‌, లీజులు అనుకూలిస్తాయి. 

• నిరుద్యోగులు, విద్యావంతుల చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది.

• పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు, జీవితాశయం నెరవేరుతుంది.

•  ఆశించిన లాభాలు, ఫలితాలు చేతికి అందుతున్న వేళ స్వార్ధపరులు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి. 

• అవివాహితులకు ఈ సంవత్సరంలో వివాహం జరుగుతుంది.

• ప్రేమ వివాహాలు కలిసిరావు.
 
• గైనిక్ ప్రాబ్లమ్స్ పట్ల కొంచం జాగ్రత్త వహించండి.

• సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది.
  
• ఆర్ధిక ఇబ్బందులను అధిగమిస్తారు. కష్టపడి అనుకున్నది సాధించి తీరుతారు.

• గతంలో మీ వలన జరిగిన తప్పిదములు తిరిగి జరగకుండా జాగ్రత్త వహించండి.
  
• విద్యా సంబంధమైన విషయాలలో తిరుగులేని విజయాలను సాధిస్తారు.
 
మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి.