తెలుగు సంవత్సరాదిలో వృషభ రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఆదాయం - 14 , వ్యయం - 11 రాజపూజ్యం - 6 , అవమానం – 1

• మీకు శని ప్రభావం తొలగింది కాని అష్టమ గురు ప్రభావం కొంత ఉంది, అయిననూ మీరు బయపడవలసినది ఏమిలేదు కొన్ని సమస్యలు వచ్చినట్లు, ఉన్నట్లు అనిపిస్తాయి కాని అవి అట్టే సమసిపోతాయి. ఇబ్బంది పెట్టవు. 

• ఈ సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉంటుంది.

• గతంలో కొన్న భూమికి మంచి ధర వస్తుంది.

• కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

• వివాహాది శుభకార్యాలకు మీరు చేసే ప్రయత్నాలు ఫలించక విసుగు పుట్టిస్తాయి, కానీ దైవానుగ్రహం వలన ఆకస్మికంగా పెళ్లి సంబంధం కుదురుతుంది.

• పది రూపాయలు ఖర్చు అయ్యేచోట ఇరవై రూపాయలు ఖర్చుచేసి కార్యక్రమాన్ని ఘనంగా జరిపిస్తారు.

• సమాజంలో ఉన్నత స్థానం కలిగిన వ్యక్తులతో కలిసి పనిచేస్తారు.

• సంవత్సర ద్వితీయార్ధంలో అంటే సుమారు సెప్టెంబర్ నుండి రెండు నెలలు వృత్తి, ఉద్యోగాలలో సంతృప్తి ఉండదు.

• సాంకేతిక విద్యా రంగంలో కలిసి వస్తాయి. 

• సంతాన పరంగా సజావుగా ఉనప్పటికి పెద్ద కొడుకు/ కూతురు విషయంలో జాగ్రత్తలు అవసరం.

• నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాన్ని ఆరంభిస్తారు.

• వ్యాపారాలలో లాభాలు సంతృప్తి కరంగానే సాగుతాయి.

• ఉద్యోగంలో స్థానచలనం గోచరిస్తుంది, అయినప్పటికీ మీ ఉనికి కాపాడుకోగాలుగుతారు.

• సహోదరి, సహోదర వర్గానికి అండగా ఉంటారు, ఎంతో కాలంగా ఉన్న సమస్యను పరిష్కరిస్తారు.

• లవ్ మ్యారేజేస్ విఫలం అవుతాయి. తాత్కాలిక వ్యామోహంలో పడి జీవితాన్ని కష్టాల పాలు చేసుకోవద్దు.

• స్పెక్యులేషన్ లకు దూరంగా ఉండండి. కొన్ని అమ్మకాల విషయంలో లాభ పడతారు ,రుణాలు తీరుస్తారు, కుదువ పెట్టిన వాటిని విడిపిస్తారు.

• మీరు ఉద్యోగం చేస్తున్న చోట రాజకీయాలు అధికం ఆగుతాయి.

• మీ పట్టుదలతో పాటు పట్టు విడుపు కుడా అవసరమే అని గ్రహించండి. పెద్దల మాట వినండి.

• మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో యోగాభ్యాసం మంచిది అని గ్రహించండి.

• మీ వాక్ చాతుర్యం, సమయస్పూర్తితో వ్యవహరించండం వలన మంచి ఫలితాలను పొందుతారు. 

• ఉద్యోగంలో కీలకమైన భాద్యతను తీసుకుంటారు. ఎంతో మందికి మీరు పెద్ద దిక్కుగా ఉంటారు.

• గురువులను, అమ్మ నాన్నలను గౌరవించండి మీకు వాళ్ళ ఆశ్శిస్సులు శ్రీరామ రక్షగా నిలుస్తాయి.

మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి.