బెటర్ లైఫ్ కావాలంటే, ఈ వాస్తు రూల్స్ పాటించాల్సిందే..!

ఏదైనా కారణం వల్లనో చాలా మంది దుస్తులను రాత్రిపూట ఉతుకుతూ ఉంటారు. అయితే, వాస్తు ప్రకారం సూర్యుడు అస్తమించిన తర్వాత పొరపాటున కూడా దుస్తులు ఉతకడం లాంటివి చేయకూడదట.
 

Vastu Tips To make Better life ram

ప్రతి ఒక్కరూ జీవితంలో బెస్ట్ దొరకాలనే అనుకుంటారు. అందరికంటే తమ లైఫ్ బెటర్ గా ఉండాలి అని అనుకుంటారు. అయితే, అలా ఉండాలి అంటే, వాస్తు ప్రకారం కొన్ని రూల్స్ పాటించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఓసారి చూద్దాం..

1.మనం నిద్రపోతున్న సమయంలో మన తల దక్షిణం లేదంటే, తూర్పు వైపు ఫేస్ చేసి ఉండేలా చూసుకోవాలి. వాస్తు ప్రకారం ఇది చాలా అవసరం.

2.పనుల కారణంగానే, ఏదైనా కారణం వల్లనో చాలా మంది దుస్తులను రాత్రిపూట ఉతుకుతూ ఉంటారు. అయితే, వాస్తు ప్రకారం సూర్యుడు అస్తమించిన తర్వాత పొరపాటున కూడా దుస్తులు ఉతకడం లాంటివి చేయకూడదట.

3.మనలో చాలా మంది పిసినారులు ఉంటారు. వస్తువు పాడైనా దానిని పారేయడానికి మనసు ఒప్పదు. దీనిలో భాగంగానే చాలా మంది విరిగిపోయిన దువ్వెన  తో దువ్వుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం ఆ పొరపాటు చేయకూడదట.

4.కొద్దరు బద్దకంతో, మరికొందరు టైమ్ లేక, ఎలా పడితే అలా దుస్తులు మడతపెడుతూ ఉంటారు. కానీ, తిరగలుగా దుస్తులు పొరపాటున కూడా మడతపెట్టకూడదట.

5.చాలా మంది ఉతికిన దుస్తులను రాత్రిపూట కూడా తీయరు. వాటిని అలానే వదిలేస్తారు. కానీ, రాత్రివేళలో అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటాయట. కాబట్టి, రాత్రిపూట దుస్తులు ఆరవేయకూడదు.

6.ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారిని గుమ్మం వద్దకు వెళ్లి మరీ ఆహ్వానిచాలి. వారు మళ్లీ వెళ్లిపోయే సమయంలో, గుమ్మం దాకా వచ్చి వీడ్కోలు పలకాలి.

7. ఇంట్లో పగిలిపోయిన అద్దాన్ని పొరపాటున కూడా ఉంచకూడదు.  పగిలిన అద్దం ఇంట్లో ఉంది అంటే, అది ఆర్థిక నష్టానికి దారి తీస్తుంది.

8.చాలా మంది దేవుడికి పూజ చేయడాన్ని ఇష్టపడతారు. ప్రతిచోటా దేవుడి విగ్రహాలు పెడుతూ ఉంటారు. కానీ, వాస్తు ప్రకారం, పడకగదిలో దేవుడి ఫోటోలు, విగ్రహాలు ఉంచి, పొరపాటున కూడా పూజలు  చేయకూడదట.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios