Asianet News TeluguAsianet News Telugu

వాస్తురిత్యా ఇంటికి గుమ్మాల సంఖ్యను బట్టి శుభాశుభాలు

వాస్తు శాస్త్రానికి భిన్నంగా ద్వారాలుంటే దానివల్ల అశాంతి జీవనాన్ని కలిగించే ఫలితాలను ఉంటాయి. 
 

Vastu tips should Every one follow
Author
Hyderabad, First Published Oct 23, 2021, 4:54 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


ఇంటికి ఎన్ని ద్వారాలు ఉంటే మంచిది అనే విష‌యం అనేక మంది త‌మ సందేహాన్ని మ‌మ్మ‌ల్ని అడుగుతుంటారు. నిజానికి  ముఖ్యంగా గృహమునకు ద్వారాల సంఖ్య, గుమ్మాలు ఉండే దిక్కు, దిశ, కొలతలు అనేవి చాలా ప్రధానమైన విషయముగా భావించాలి. 

* వాస్తు శాస్త్రానికి భిన్నంగా ద్వారాలుంటే దానివల్ల అశాంతి జీవనాన్ని కలిగించే ఫలితాలను ఉంటాయి. 

* శుభాన్ని కలిగించే ద్వారాల సంఖ్య ఫలితాలు ఇప్పుడు చూద్దాం.

1) ఇంటికి 2 ద్వారములు.. ఉంటే ఆ ఇల్లు శుభ‌క‌ర‌మ‌ని చెబుతుంది శాస్త్రాం. 

2) ఇంటికి 4 ద్వారాలు ఉన్న గృహం మంచి ఆరోగ్యం అందిస్తుంది. శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితాలు ఉంటాయి. గౌరవ ప్ర‌తిష్టలు క‌ల‌గ‌జేస్తుంది.

3) ఇంటికి 6 ద్వారాలున్న ఇంట్లో ఐశ్వర్యము, పుత్ర వృద్ధి, శ్రేయస్సు కలిగిస్తుంది. 

4) ఇంటికి 8 ద్వారములు ఉన్న గృహములో అష్టైశ్వర్యాలు క‌లుగుతాయి. సకల భోగభాగ్యములు క‌లుగుతాయి. 

5) ఇంటికి 12 ద్వారములు గల గృహం మంచి చ‌దువు, ఉద్యోగ, వ్యాపారములలో వృద్ధిని, కీర్తిని కలిగిస్తుంది. 

6) ఇంటికి 14 ద్వారలు ఉన్న ఇల్లు ధన సంపద, కుటుంబ వృద్ధిని కలిగిస్తుంది. 

7) 16 ద్వారములు గల గృహములో అన్నింటా లాభములు, అధికారమును, జీవనంలో లాభాలను కలిగిస్తుంది.


* ఇంటికి కీడును కలిగించే సంఖ్య గల గుమ్మాల విష‌యానికి వ‌స్తే.. 

1) ఇంటికి 3 ద్వారములు ఉండ‌టం వలన శత్రువుల వలన బాధలు, అపనిందలు వ‌స్తాయి, అధిక ఖర్చులతో ఆర్థిక బాధ‌లు ఉంటాయి. 

2) ఇంటికి 5 ద్వారములు గల ఇల్లు సంతానానికి సంబంధించిన పీడలు, రోగ బాధలు, శత్రువుల నుండి బాధలు కలిగిస్తుంది. 

3) ఇంటికి 7 గుమ్మాలు ఉన్న ఇంటిలో ఫలితం అనారోగ్యం, వ్యభిచార అల‌వాట్లు, అనుకోని క‌ష్టాలు క‌లుగుతాయి.

4) ఇంటికి 9 ద్వారములు ఉన్న గృహం వలన శరీర పీడను కలిగించి యజమానికి నష్టాన్ని కలిగిస్తుంది. 

5) ఇంటికి 10 గుమ్మాలు ఉన్న ఇల్లు కష్టనష్టాలను కలిగిస్తుంది, ఆ ఇంటికి దొంగల వలన భయం ఉంటుంది. 

6) ఇంటికి 11 ద్వారాలు కలిగి ఉన్న ఇల్లు వలన ఫలితం అష్టకష్టములు కలిగిస్తుంది, భార్య వ్యభిచారము చేసేలా చేస్తుంది. 

7) ఇంటికి 13 ద్వారాలు ఉంటే మరణ ప్రమాదములు, కష్టనష్టాలను ఏర్ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. 

8 ) ఇంటికి 15 ద్వారములు ఉన్న గృహము అనేక కష్టాలు, బాధలు,అశాంతి, అధిక ఖర్చులను కలిగిస్తుంది.

* వాస్తురీత్యా సూచించిన సరియైన గుమ్మాల సంఖ్య ఉన్నట్టయితే ఆ ఇంట్లో నివసించే వారు ఆరోగ్యంగా, అన్యోన్యంగా ఉంటూ, ఒకరి కొకరు సహకరించుకుని ఆనందమయంగా దిన దిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఉంటారు.

* ప్రతి ఇంటికి తప్పకుండా పంచాలోహంతో తయారు చేసిన మత్స్యయంత్రాలు శాస్త్రోక్తకంగా ప్రాణప్రతిష్ట గావించి ఇంటికి నలు దిక్కులలో యజమాని తారాబలానికి తగిన మూహూర్తంలో సరైన దిశలలో సరైన విధివిధానంగా స్థాపన చేస్తే ఎన్నో రకాలుగా మేలును కలిగిస్తాయి.    

* శాస్త్రానికి భిన్నంగా గుమ్మాల సంఖ్య ఉన్నట్లయితే ఆ కుటుంబంలో కలతలు, కలహాలు, అనారోగ్యాలు, ఇతర అనేక కష్టనష్టాలను కలిగిస్తుంది. 
కావున సరైన అనుభవజ్ఞులైన వాస్తు శాస్త్ర పండితుల స‌ల‌హాలు పాటించాలి.


 

Follow Us:
Download App:
  • android
  • ios