Asianet News TeluguAsianet News Telugu

ఇంట్లో ఎప్పుడూ డబ్బులు నిలవాలంటే... ఈ వాస్తు చిట్కాలు పాటించాల్సిందే

ఇలా డబ్బులు వచ్చి అలా ఎదో రూపంలో వెళ్ళిపోతాయి కాబట్టి కొన్ని వాస్తు నియమాలు పాటించడం ఎంతో అవసరం. వంటగది ఎప్పుడూ ఆగ్నేయ దిక్కులోనే ఉండాలి, వంట చేసే వ్యక్తీ ముఖం తూర్పు దిశను చూస్తున్నట్లు కిచెన్ గట్టు ఏర్పాటు చేసుకోవాలి.

Vastu Tips for Money, Prosperity & Financial Success at Home
Author
Hyderabad, First Published Jun 11, 2020, 1:35 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Vastu Tips for Money, Prosperity & Financial Success at Home

ధనం మూలం మిదం జగత్ అన్నారు పెద్దలు. ఎప్పుడు ధనం సమృద్ధిగా ఉండాలంటే మనం నివసించే ఇంటి వాస్తు సరిగ్గా ఉండాలి. లేదంటే డబ్బు మనతో ఉండదు. ఇలా డబ్బులు వచ్చి అలా ఎదో రూపంలో వెళ్ళిపోతాయి కాబట్టి కొన్ని వాస్తు నియమాలు పాటించడం ఎంతో అవసరం. వంటగది ఎప్పుడూ ఆగ్నేయ దిక్కులోనే ఉండాలి, వంట చేసే వ్యక్తీ ముఖం తూర్పు దిశను చూస్తున్నట్లు కిచెన్ గట్టు ఏర్పాటు చేసుకోవాలి. ప్రవేశ మార్గం, ఇల్లు  ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి.
 
డబ్బు కోసం వాస్తు నియమాలు:- మనుషులు అన్నాకా డబ్బులు ఎవరికిని చేదు కాదు. డబ్బు వద్దు అనేవాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే డబ్బుతో ఏదైనా, దేన్నైనా సొంతం చేసుకోవచ్చు అనుకునేవాళ్లు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అంతగా ధనం ప్రపంచాన్ని శాసిస్తుంది. అందుకే పెద్ద వాళ్లు ధన మూలం ఇదం జగత్. డబ్బుతోనే ఈ ప్రపంచ నడుస్తోంది అని అర్థం. డబ్బు కోసమే తోబుట్టువులు కుడా గొడవలు పడటం, విడిపోవడం జరుగుతున్నది మనం చూస్తూనే ఉన్నాం. 

అయితే ఈ డబ్బు సంపాదించడం అంత సులభమేం కాదు. ఎంతగా కష్టపడుతున్నా డబ్బు సంపాదించలేక పోతున్నారంటే అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది మనం ఉండే ఇల్లు వాస్తు లోపంగా ఉండడం. ఉండే ఇల్లు వాస్తు ప్రకారం నిర్మించుకోనట్లయితే దాని ప్రభావం ఆర్ధిక వ్యవస్థపై, డబ్బు మీద పడుతుంది. అందుకే ధనం ఇంట నిక్షేపంగా ఉండాలంటే కొన్ని వాస్తు నియమాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

పడక గది నిర్మాణంలో పాటించాల్సిన వాస్తు నియమాలు:- ప్రతి ఇంట్లో వాస్తుకు సంబంధించి ఐదు ముఖ్యమైన అంశాలు, 16 వాస్తు మండలాలు ఉంటాయి. ఇవి మీ ప్రవర్తన, ఆలోచన విధానంలో ఎంత మేరకు రాణిస్తున్నారో నిర్ణయిస్తాయి. అందువల్ల వాస్తు నిపుణులను కలిసి మీ ఇంట్లో సరైన క్రమంలోనే ఉందో లేదో కనుక్కోండి. అప్పుడే మీ సంపద ఇంట్లో ఉంటుంది. ఇంట్లో అన్ని సక్రమంగా ఉన్నాయో లేదో వివరంగా అధ్యయనం చేయండి. ఏదైనా వాస్తు దోషం ఉంటో నిపుణులతో కలిసి అందుకు తగిన నివారణలుంటే అమలు చేయండి.

ఇంట్లో ఉత్తర దిక్కు ప్రాంతంలో నీలం రంగును వేయాలి. ఈ ప్రాంతంలో ఎలాంటి ఎరుపు రంగు షేడ్స్ ను వాడకూడదు. వంటగది, మరుగుదొడ్డికి ప్రత్యేకత ప్రాంతాన్ని కేటాయించాలి. ఈ ప్రాంతంలో డస్ట్ బిన్, వాషింగ్ మెషిన్, చీపురు, రోలు, మిక్సర్ గ్రైండర్ తదితర ఎలక్ట్రిక్ ఉపకరణాలను వినియోగించవద్దు. వంటగది అగ్నిని సూచిస్తుంది కాబట్టి ఇలాంటి ప్రదేశం తప్పుగా ఉంటే మీ సంపద దూరమయ్యే అవకాశముంది.

ఉత్తర ప్రాంతంలో పెరడును ఉంచుకోవాలి. లేదా ఈ దిక్కున ఆకుపచ్చగా ఉండే అడవి ఉంటే ఎంతో మేలు చేకూరుతుంది. దీని వల్ల సంపద ఎక్కువగా ఉంటుంది. వాయువ్య ప్రాంతంలో మీ ఆర్థిక మద్దతు కోసం బ్యాంకింగ్ తదితర అంశాలకు సంబంధించిన ఆస్తులు ఉంచాలి. ఇంటి ముఖ ద్వారం శుభ్రంగా, అందంగా ఉండాలి. దీని వల్ల సంతోషం, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. కాబట్టి ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు ప్రవేశ మార్గం శుభ్రంగా ఉండటం ఎంతో ముఖ్యం. గుమ్మంపైన బయట ఎలాంటి దేవుని పటములు, విగ్రహాలు, చెక్కడాలు ఉండ కూడదు. ఇంటిలోపలి వైపు నవయంత్ర సహిత గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పాదాలు ఉండవచ్చును. 

నైరుతి 'దిశ'లో తలుపుంటే అది అప్పులు చేస్తుంది, ఆర్ధిక ఇబ్బందులను సృష్టిస్తుంది. ఉత్తర వైపు ప్రవేశ మార్గముంటే మంచి అవకాశాలు, సంపదకు దారి తీస్తుంది. తూర్పున ప్రవేశ మార్గముంటే ప్రశాంతత చేకూరుతుంది. దక్షిణాన ప్రవేశ మార్గముంటే అదృష్టం వరిస్తుంది.
వంట గది తప్పని సరిగా ఇంటికి ఆగ్నేయ దిక్కులోనే ఉండాలి. ఎరుపు, నారింజ, గులాబి రంగులను వంటగదికి పెయింట్ చేయాలి. వర్క్ టేబుల్, డ్రాయింగ్ రూమ్ ను ఉత్తర ప్రాంతంలో ఉంచాలి.

ఇంటి పశ్చిమ దిక్కున ఆదర్శ రంగులైన తెలుపు, పసుపు లాంటి రంగులను వాడాలి. గుండ్రటి ఆకారంలో ఉన్న వస్తువులను ఉపయోగిస్తే మంచిది. ఎందుకంటే అవి భూమిని సూచిస్తాయి. నైరుతి దిక్కు పొదుపును సూచిస్తుంది. ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. చదువుకునేందుకు స్టడీ రూమ్ గాను ఇక్కడ వాడుకోవచ్చు. ఈ ప్రాంతంలో మీ డబ్బు విలువైన వస్తువులను పదిలంగా ఉంచుకోవాలి. మార్కెట్ లో లభించే పుస్తకాలను చదివి మాకు అన్ని తెలుసు అని స్వంత నిర్ణయాలతో ఇంట్లో ఉపయోహించే వస్తువులను నచ్చినట్లు పెట్టుకుని తంటాలు తెచ్చుకోవద్దు. శాస్త్రంపై అవగాహణ కలిగిన అనుభవజ్ఞులైన పండితునికి దక్షిణ తాంబులాదులు ఇచ్చి వాస్తు పరీక్షా చేయించుకుంటే మంచిది. అన్ని వాస్తు సూత్రాలకు అనుగుణంగా ఉన్న చోటనే ధనం నిలుస్తుంది, కలిసి వస్తుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios