ఉద్యోగస్తులు తమ జాతకం, గోచారాదులను పరిశీలించుకుంటూ ఉద్యోగాలలో జాయింగ్‌ సమయాలు, సరియైన ముహూర్తాలలో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది.

సమాజంలో వేరు వేరు వర్గాల వారికి ముందు జాగ్రత్తలను తెలియజేస్తూ వారు ప్రవర్తించాల్సిన విధానాన్ని తెలియ జేస్తుంది జ్యోతిషం.

ఉద్యోగస్తులు తమ జాతకం, గోచారాదులను పరిశీలించుకుంటూ ఉద్యోగాలలో జాయింగ్‌ సమయాలు, సరియైన ముహూర్తాలలో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. సరియైన సమయాలు తెలుసుకుని చేసే కార్యకలాపాల వల్ల గౌరవం హోదాలు పెరగడమే కాక,ఉద్యోగం ద్వార లోకానికి మేలు చేసేవారవుతారు. ఈ విషయాలు తెలుసుకోకుండా ప్రవర్తించడం ఉద్యోగాలలో డిమోషన్స్‌, ప్రాబ్లమ్స్‌ గురై ఉన్నది కోల్పోవాల్సి వస్తుంది. కాబ్టి అనుకూలమైన ప్రదేశాలను, కాలాలను తెలుసుకొని ఉద్యోగులు ప్రవర్తిస్తే ఆనందప్రదమైన జీవితం గడుపుతారు.

కాలానుగుణమైన జీవిత విధానాన్ని తెలియజేస్తూ శుభాశుభ కాలాల్లో ప్రయత్నించాల్సిన విధానాన్ని, జాగ్రత్తలు తీసుకునే విధానాన్ని పరిహారక్రియల రూపంలో తెలియజేస్తుంది.

జీవితంలో వేరు వేరు భాగాలలో చేసుకునే వేరు వేరు కార్యక్రమాలను మంచి సమయం చూసి నిర్ణయించుకునే అవకాశాన్ని గ్రహగతులు రాశి విశేషాలద్వారా తెలియజేస్తుంది. వాటి అనుగుణంగా శుభ కార్యాలు చేసుకుంటూ ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది.

విద్యార్థులు పోటీపరీక్షల్లో తాము సరియైన విధంగా నిలదొక్కుకోవడం, తమకు ఏ రంగమైతే ఉత్తమంగా తీర్చి దిద్దుకుంటారో తెలుసుకొని ఆయా రంగాల్లో ప్రవేశించడం వల్ల తమ ఆలోచనలకు మెరుగులుదిద్ది ఆరంగంలో కృషి చేసి తమకు లోకానికి ఉపయోగపడేవారౌతారు. ఈ విషయాలు తెలుసుకోకుండా ఇష్టంలేని చదువులు చదివి పక్కవారిని చూసి అనవసర ప్రలోభాలకు గురికాకుండా జాగ్రత్త పడి, ఆనందమయ జీవితాన్ని ఆస్వాదించాలి.

వ్యాపారస్తులు ఎప్పుడూ సమాజాన్ని అనుసరించి ప్రవర్తించాలి. దానికి అనుగుణంగా ఒక అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. కొన్ని కదశ ల్లో ఈ వేగవంతమైన జీవితాన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. అటువంటి సమయాలను తెలుసుకొని సరియైన ప్రయత్నాలు చేయడం పరిహార క్రియలు చేసుకుంటూ ఉండడం వల్ల మళ్ళీ ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోగలుగుతారు. లేకపోతే ఉన్నది కోల్పోవడం, అమ్ముకోవడం, మళ్ళీ నిలదొక్కుకోలేని స్థితికి దారితీసే విధంగా ఉంటుంది. అందుకు వ్యాపారస్తులు కూడా నిరంతరం తమ గురించి తాము తెలుసుకోవడానికి జ్యోతిషం ఉపయోగపడుతుంది.

వివాహాదులు జరిగేసమయాలను, దశ అంతర్దశల ద్వారా తెలుసుకొని మంచి సమయాలకు ప్రాధాన్యత ఇస్తూ వివాహానికి ఆ సమయంలో సరియైన ప్రయత్నాలు చేయడం వల్ల వధూవరుల జీవితం ఆనందమయంగా ఉంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చిన సమయాల్లో వివాహాలు చేయడం, వివాహ సమయంలో పొంతనలు చూసుకోకపోవడం వల్ల వధూవరులు ఇద్దరూ బాధపడుతూ తమ తల్లితండ్రులను అందరినీ ఇబ్బంది పెడుతూ వివాహాన్ని ద్వేషించే విధంగా కాకుండా ఉండడానికి జ్యోతిషం ఉపయోగపడుతుంది.

సంతాన సమయాలు కూడా ఇద్దరికీ యోగ్యమైనవా కావా తెలుసుకొని ఆ సమయంలో సంతానం కోసం ప్రయత్నం చేయడం వల్ల ఉత్తమమైన సంతానం కలిగి సమాజానికి ఉత్తమమైన సంతానాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది.

రాబోయే సమయాల్లో ఏవైనా అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఉంటే వాటికి ఏ రకమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిది అనే విషయాలు తెలుసుకొని తమ ఆరోగ్యాలను కూడా కాపాడుకుంటూ ఉండడం మంచిది.

ఈ విధంగా ప్రతి ఒక్కరికీ జ్యోతిషంతో ఉపయోగం ఉంటూనే ఉంటుంది. ప్రతీ ఒక్కరూ తమ తమ జ్యోతిష్కులను ప్రతి ఆరు మాసాలకు ఒకసారి సంప్రదించడం మంచిది. ఫ్యామిలీ డాక్టర్‌లాగ ఫ్యామిలీ ఆస్ట్రాలజర్‌ ఉండడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ