Asianet News TeluguAsianet News Telugu

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం: వృషభ రాశి వారి తెలుగు పంచాంగ సంవత్సర ఫలాలు

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ప్రకారం వృషభ రాశివారికి ఈ ఏడాది   ఋణ బాధలు కొంతమేర తీరి ప్రశాంతత లభించును. శత్రువుల పైన పైచెయ్య సాధిస్తారు. . గృహవనందు శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. దైవతా కార్యక్రమాలలో పాల్గొంటారు. 

Ugadi 2023 telugu panchangam rasi phalalu of taurus
Author
First Published Mar 14, 2023, 3:43 PM IST

కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.  ఈ సంవత్సరంలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి   ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

ఆదాయం:-14
వ్యయం:-11
రాజపూజ్యం:-6
అవమానం:-1
గురుడు:-సంవత్సర ప్రారంభం నుండి ఏకాదశ స్థానం అయిన మీన రాశి యందు సంచారం తదుపరి ఏప్రిల్ 21 నుండి వ్యయస్థానం అయిన మేష రాశి యందు సంచారం చేయను
శని:-ఈ సంవత్సరం ఆరంభం నుండి దశమ స్థానము నందు సంచారం చేయను
రాహు:-సంవత్సర ప్రారంభం నుండి ద్వాదశ రాశి అయిన మేష రాశి యందు సంచారం చేయను తదుపరి అక్టోబర్ 31 తేదీ నుండి ఏకాదశ రాశి అయిన మీనరాశి ఎందుకు సంచారం చేయను.
కేతువు:- సంవత్సర ప్రారంభం నుండి షష్టమరాశి అయిన తులా రాశి యందు సంచారం చేసి అక్టోబర్ 31 తేదీ నుండి పంచమ రాశి అయిన కన్య యందు సంచారం చేయను.  

ఈ సంవత్సరం అనుకూలమైన అభివృద్ధి కలిగించేటువంటి సంవత్సరం. తలచిన పనులు అనుకున్నది అనుకున్నట్లుగా సకాలంలో పూర్తి అవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు చేయవలసి వస్తుంది. ఋణ బాధలు కొంతమేర తీరి ప్రశాంతత లభించును. శత్రువుల పైన పైచెయ్య సాధిస్తారు. . గృహవనందు శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. దైవతా కార్యక్రమాలలో పాల్గొంటారు. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరిగి ప్రేమపూరిత వాతావరణం ఏర్పడుతుంది. భూ గృహ నిర్మాణ  విక్రయాలు యందు ధనలాభం కలుగుతుంది.  సమాజములో ఎటువంటి వారనైనా సరే వారి మీద పైచేయి సాధిస్తారు. కీలకమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి ధైర్యం తోటి ముందుకు వెళ్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు ఉన్నత అధికారం కలుగుతుంది. పిత్రార్జితం స్థిరాస్తి విలువ పెరుగుతుంది.

Also Read శ్రీ శోభకృత్ నామ సంవత్సర మేష రాశి తెలుగు పంచాంగ రాశి ఫలాలు


ఈ రాశివారి మాసవారీ ఫలితాలలోకి వెళితే... 

ఏప్రిల్
ధనధాన్యాది లాభాలు పొందగలరు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. సమాజము నందు కీర్తి గౌరవం లభించడం. విద్యార్థులు చదువు యందు ప్రతిభ పాటలు చూపిస్తారు. పెద్దల యొక్క ఆదరణ పొందగలరు. ఆర్థికంగా బలపడతారు. భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.


మే
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగవనందు అధికారులతోటి సమస్యలు ఏర్పడను. ఊహించిన సమస్యలు ఎదురవగలవు. అనుకున్న పనులు వాయిదా పడొచ్చు. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇతరులతోటి వాగ్వాదాలకు దూరంగా ఉండండి.

జూన్
ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. సంతానమాకు ఉన్నత విద్యా అవకాశాలు  రావచ్చును. అభివృద్ధి కార్యక్రమాలలోఅన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్త ఆలోచనలు ఆచరణలో పెడతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆదాయ మార్గాలు బాగుంటాయి. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు.

జూలై
ఆర్థికంగా లాభ పడతారు.భూ గృహ నిర్మాణ పనులు పూర్తి చేస్తారు.విద్యార్థులకు అనుకూలం . కుటుంబ  సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. నూతన వస్తు వాహనాలకు కొనుగోలు చేస్తారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును.

ఆగస్టు
ఈమాసం అనుకూల వాతావరణం . ఆర్థిక సమస్యలు తీరి ప్రశాంతత లభించును. కీలకమైన సమస్యలన్నీ కూడా తొలగి ప్రశాంతత లభిస్తుంది. శుభ కార్య వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండండి. వ్యాపారమునందు పెట్టుబడికి తగ్గ ధనాధాయ లభిస్తుంది.

సెప్టెంబర్
ఆదాయ మార్గాలు బాగుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. సమస్యల విషయంలో ధైర్యంగా ఎదుర్కొంటారు. సమాజం నందు మీ మాటకు విలువ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మి కార్యక్రమంలో పాల్గొంటారు.

అక్టోబర్
ఉద్యోగం నందు అభివృద్ధి కనబడును. ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు అన్వేషణ ఫలిస్తాయి. సంతానం కోసం ఎదురుచూసేవారు శుభవార్త వింటారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారం నందు ఊహించని ధన లాభం కలుగును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.

నవంబర్
భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. ఇంటికి సంబంధించిన అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఆదాయానికి మించి ఖర్చులు చేయవలసి వస్తుంది. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. అవసరమైన ప్రయాణాలు చికాకు పుట్టించును. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

డిసెంబర్
తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడిన చివరకు పూర్తి చేస్తారు. మానసికంగా శారీరకంగా  బలబడతారు. కోప వేషాలు తగ్గించుకుని వ్యవహారాలు పూర్తి చేయవలెను. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. ఉద్యోగవనందు అధికారుల తోటి ఇబ్బందికర పరిస్థితులు ఉండగలవు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్త వహించాలి.

జనవరి
చేయు పని యందు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆదాయనకు మించి ఖర్చులు ఏర్పడగలవు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. ఇతరుల యొక్క వ్యవహారంయందు హామీలకు దూరంగా ఉండవలెను. రావలసిన బాకీలు వసూలు గాక మానసిక ఒత్తిడి పెరుగును. కోపా వేశాలు నియంత్రించుకోవాలి. ఇష్టం లేని పనులు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేట మంచిది. రుణాలు చేయు విషయంలో జాగ్రత్త అవసరం.

ఫిబ్రవరి
పాత సమస్యలకు మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది. ఉద్యోగవనందు అనుకూలమైన మార్పులు ఏర్పడగలవు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. గృహనందు దేవతా సంబంధిత కార్యక్రమాలు ఆచరిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటికా జరుగును. సమాజం నందు గౌరవం లభిస్తుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

మార్చి
వ్యాపారం నందు పెట్టుబడి తగ్గ ధన లాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు బాగున్నాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలగజేస్తుంది. విద్యార్థులు చదవయందు ప్రతిభ కనబరుస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios