డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

ఆదాయం -  2  , వ్యయం  - 11                       రాజపూజ్యం - 2 ,  అవమానం – 4 


• లగ్నంలో ఉన్న రాహువు.. సప్తమంలో ఉన్న గురుకేతువులు,        

• అష్టమంలో ఉన్న శని,      

• ఇంట్లో ప్రోత్సాహం బాగానే ఉన్నను చిన్న చిన్న చికాకులు ఇబ్బంది కలిగిస్తాయి. 

• కొన్ని విషయాలలో కొంత మానసిక సమస్యలు కలుగుతాయి.

• వ్యాపారులకు సానుకూలంగా ఉంటుంది.
    
• తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది.    

• ప్రతి విషయంలోనూ సహోదరీ వర్గం, సహోదర, తల్లిదండ్రులు, మీ హితవు కోరే పెద్దలు కొండంత అండగా నిలుస్తారు. 

• వివాహాది శుభకార్యాల విషయంలో మాట నెగ్గించుకుంటారు.

• పోటీ పరీక్షలకు ఎంపికవుతారు.

• కళాకారులకు అనుకూలంగా ఉంటుంది.

• శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి.

• పూర్వీకుల ఆస్తి పంపకాలకు సంబంధించి పత్రాలు అస్పష్టంగా ఉంటాయి.

• అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగిరాని బాకీలు వివాదస్పదం అవుతాయి. 

• కంబైండ్‌ స్టడీస్‌ వల్ల నష్టపోతామని గ్రహించి జాగ్రత్తపడాలి.

• అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సోమరితనాన్ని పక్కనపెట్టి శారీరకంగా, మానసికంగా శ్రమించాలి. 

• ప్రతి విషయంలోనూ, ప్రతి రంగంలోనూ గట్టి పోటీ ఎదుర్కొంటారు. 

• విద్యాసంబంధమైన విషయాలు, బంధువులు, మధ్యవర్తిత్వం చేసి వ్యవహారం కొలిక్కి తీసుకువస్తారు.  

• ప్రతిష్ఠాత్మక సంస్థలలో పనిచేయడానికి అవకాశాలు లభిస్తాయి.

• సహనం ప్రదర్శించాలి అప్పుడే సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. 
    
మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి.