డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

   ఆదాయం 14,     వ్యయం - 11             రాజపూజ్యం - 7,         అవమానం - 7

•   తులారాశి వారికి భాగ్యంలో ఉన్న రాహువు, మూడింట ఉన్న గురుకేతువులు, నాలుగింట ఉన్న శని ఉన్న ఫలితంగా 

• ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి

• భాగస్వామ్య వ్యాపారాలలో ఖర్చులు వాటాలను దాదాపు మించిపోతాయి. ఇలాంటివి సామరస్యంగా నాలుగు గోడల మధ్య    పరిష్కారం చేసుకుంటారు. 

• వ్యాపార సంబంధ, విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 

• వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త బ్రాంచీలు విస్తరిస్తారు.

•  భాగస్వామ్య వ్యాపారాలు మధ్యస్తంగా ఉంటాయి.

•  ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచించి ముందుకు వెళ్లాలని యోచిస్తారు. 

• బంధువర్గం ప్రతికూలంగా మాట్లాడతారు. 

•  విదేశాలలోని బంధువుల అభివృద్ధి, పేరుప్రతిష్టలు సంతోషానికి కారణమవుతాయి.  

• రావలసిన బాకీలు జమ చేసుకుంటారు. 

• కుటుంబ ,వ్యవహార అదనపు బాధ్యతలు తప్పవు.  

• సంతాన పురోభివృద్ధికి కృషి చేస్తారు.

• అన్ని విషయాలను గోప్యంగా ఉంచుతారు. ఎవరికోసమో ఎదురించి ప్రయోజనం లేదని తెలుసుకుంటారు.   

•  ఇబ్బందులు ఎదురైనా మౌనంగా బాధను దిగమింగుకుంటారు. మొత్తానికి అనుకున్నది సాధిస్తారు

• సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కీలకం అవుతుంది.  

• ఉద్యోగంలో మార్పులు, బదిలీలు సూచిస్తున్నాయి.

• ఆర్ధిక పరమైన కొన్ని ఇబ్బందులు అనుకోని అనవసర ఖర్చులు ఏర్పడతాయి.

• పొదుపు, సహనం చాలా అవసరం అని గ్రహించండి. తొందరపాటు తగదు.

•  నరదృష్టి, బంధువుల దృష్టి మీపై అధికంగా ఉంటుంది. జాగ్రత్తతో వ్యవహరించం ఉత్తమం.  

• మీ శక్తి సామర్ధ్యాలతో పైకి వచ్చిననూ అది చూసి ఓర్వలేక అసూయగా ప్రవర్తించే వారు అధికంగా ఉంటారు.

• విద్యార్ధులు పోటి పరీక్షలలో విజయం సాధిస్తారు.

• ప్రేమలు, వివాహాలు ఇవన్ని మోసం అని మీకు జ్ఞానోదయం కలిగిస్తాయి.

• మీ మాటలో నమ్రత, ఎదుటివారితో ప్రేమగా సౌమ్యంగా మాట్లాడగలిగితే మీకు మేలు జరుగుతుంది.   

• కఠినమైన సమస్యలకు ఎదురొడ్డి దైర్యంగా పోరాడుతారు, విజయాన్ని కైవసం చేసుకుంటారు. 

• కుటుంబ సభ్యుల కొరకు విలువైన వస్తువులు కొంటారు.  

• వైఫల్యం నుండి నేర్చుకున్న పాఠాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి వైపు పయనిస్తారు.

మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి.