సెప్టెంబర్ 23 ఆదివారం 2018..మీ రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today september23rd 2018your horoscope

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఒత్తిడితో సౌకర్యాలు పూర్తిచేస్తారు. ఆశలు పెంచుకుంటారు. ఆహారంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తలు. మోసపోకూడదు. గృహ విషయంలో ఆశలు పెరుగుతాయి. విద్యార్థులకుం ఒత్తిడి అధికం. శ్రమకు వెనకాడతారు. కాలం వృథా అవుతుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అన్యుల సహాయ సహకారాలు అందుతాయి. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. దగ్గరి ప్రయాణాలపై దృష్టి పెడతారు. ప్రయాణాలుఅనుకూలిస్తాయి. విద్యార్థులకుం అనుకూల సమయం. పరామర్శలు చేస్తారు. సాధనాలు వినియోగిస్తారు. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వాగ్దానాల వల్ల ఇబ్బందులు. అనవసర ఇబ్బందులు. సమయం వృథా అవుతుంది. నిల్వ ధనం కోల్పోతారు. అనవసర ఖర్చులు చేస్తారు. కుంటుంబంలో కలతలు వచ్చే సూచన. అనవసర ప్రయత్నాలు చేయవద్దు. కాలం వృథా అవుతుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శారీరక శ్రమ అధికం. అనవసర పనులు చేస్తారు. అనవసర ఆలోచనలు వస్తాయి. సమయం వృథా అవుతుంది. గుర్తింపు లభించదు. ప్రణాళికల్లో లోపాలు ఉంటా యి. పట్టుదల అవసరం. కార్యసాధనలో ఆలోచన ఉండాలి. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.

 

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనవసర ప్రయాణాలు చేస్తారు. ఊహించని ఇబ్బందులు వస్తాయి. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. పాదాల నొప్పులు పెరుగుతుంది. కాలం, సమయం, శ్రమ అన్నీ కోల్పోతారు. ఇతరులపై ఆధార పడతారు. దేహసౌఖ్య లోపం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. తెలియని ఆదాయాలు వస్తాయి. కళాకారులకుం అనుకూలం. శ్రమలేని ఆదాయంపై దృష్టి వెళుతుంది. సమిష్టి ఆదాయాలపై దృష్టి ఉంటుంది. పనుల్లో సంతృప్తి లభిస్తుంది. ఆదాయమార్గాలపై దృష్టి సారిస్తారు. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అధికారులతో ఒత్తిడి ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. చిత్త చాంచల్యం అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో అనవసరం ఉంటాయి. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటపడతారు. కీర్తిప్రతిష్టలపై దృష్టి పెడతారు. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : విద్యార్థులకుం ఒత్తిడితో కూడిన సమయం. శ్రమను వినియోగిస్తారు. కాలం వృథా అవుతుంది. ధనం వ్యర్థమవుతుంది. సంతృప్తిని కోల్పోతారు. ప్రయాణాలు చేయాలనుకుంటారు. అనవసర ప్రయాణాలు. దురాశ పెరుగుతుంది. ఏవో ఊహలు. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శ్రమకుం తగిన ఫలితం వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. గుర్తింపుకోసం ఆరాటం. బద్ధకంగా ఉంటా రు. అనవసర ఇబ్బందులు పడతారు. వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం.   అనారోగ్య భావన. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : నూతన పరిచయాలు ఒత్తిడికి గురిచేస్తాయి. సామాజిక అనుబంధాల్లో ఆలోచనలు పెరుగుతాయి. గౌరవంకోసం ఆరాట పడతారు. భాగస్వామ్య అనుబంధాల్లో జాగ్రత్త అవసరం. మోసపోయే ప్రమాదం. సమయం వృథా అవుతుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శ్రమాధిక్యం ఉంటుంది. శ్రమలేని ఆదాయం వస్తుంది. విద్యార్థులు పోటీ ల్లో గెలుపుకై ప్రయత్నం. గుర్తింపుకై ప్రయత్నం. ఋణసంబంధ ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది. శతృవులపై విజయానికై ఆలోచనలు. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సంతాన ఆలోచనల్లో ఒత్తిడి. సమయాన్ని కోల్పోతారు. విద్యార్థులకుం ఒత్తిడి. సృజనాత్మకతను కోల్పోతారు. అనవసర ఇబ్బందులు వస్తాయి. మానసిక ఒత్తిడి అధికం. ధనం వృథా అవుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.

డా.ఎస్. ప్రతిభ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios