మేషం : (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) : ఆధ్యాత్మిక యాత్రల పై దృష్టి పెడతారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. దూరయాత్రలు చేసే ఆలోచన ఉంటుంది. సంతృప్తి లభిస్తుంది. ఆలోచనల్లో ఉన్నతి ఏర్పడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం జరుగుతుంది. పెద్దవారితో స్నేహానుబంధాలు పెరుగుతాయి. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

వృషభం : (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు) : ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. శ్రమాధిక్యం కనబడుతుంది. పరామర్శలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రమాదాలకు సూచన. వైద్యశాలలు, పరామర్శలు ఉంటాయి. దానధర్మాలకు అధిక ధనాన్ని వినియోగించడం మంచిది.

మిథునం : (మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక అనుబంధాలు విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు. నూతన పరిచయస్తులతో ఒత్తిడి ఏర్పడుతుంది. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపారస్తులు అధిక జాగ్రత్త వహించాలి. అనవసర పెట్టుబడుల జోలికి వెళ్ళకూడదు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కర్కాటకం : (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పోటీల్లో ఒత్తిడి ఉంటుంది. ఎక్కువ శ్రమతో తక్కువ ఫలితాల సాధన ఉంటుంది. గుర్తింపుకోసం ప్రయత్నం చేస్తారు. అనుకున్న పనులు పూర్తికావు. శత్రువులపై విజయ సాధనకు కృషి అధికంగా ఉంటుంది. అప్పుల వలన ఇబ్బంది ఏర్పడవచ్చు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతాన సమస్యలు తలెత్తే సూచనలు కనబడుతున్నాయి. ప్రణాళికలకు అనుగుణమైన వ్యూహ రచన చేసుకోవాలి. సృజనాత్మకత ఉంటుంది. ఆలోచనల్లో నూతననత్వం కనబడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కన్య : (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఒత్తిడితో సౌకర్యాలను పూర్తిచేసుకునే ప్రయత్నం ఉంటుంది. గృహ వాహనాదుల విషయంలో అనుకున్న సంతృప్తి లభించకపోవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. సమయానికి తీసుకునే ప్రయత్నం. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. క్రీంఅచ్యుతానంత గోవిందజపం.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : కమ్యూనికేషన్స్ విస్తరిస్తున్నాయి. చిత్త చాంచల్యం తగ్గుతుంది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. రచనాశక్తి పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. పెద్దలమాట వినే ప్రయత్నం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృశ్చికం : (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : వాగ్దానాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. కుటుంబంలో అసౌకర్యం. కుటుంబ సంబంధాల్లో జాగ్రత్త వహించాలి. అనవసర ఒత్తిడులు ఉంటాయి. మాట విలువ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక నిల్వలు తగ్గిపోయే సూచనలు కనబడతాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

ధనుస్సు : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనులలో ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధమైన పనుల నిర్వహణ చేస్తారు. ఆలోచనలకు అనుగుణంగా పనుల రూపకల్పన ఉంటుంది. శ్రమానంతరం ఫలితం లభిస్తుంది. శ్రమను మర్చిపోతారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మకరం : (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విశ్రాంతికి ప్రయత్నిస్తారు. విశ్రాంతి లభిస్తుంది. అనవసర ఖర్చులు పెడతారు. దానధర్మాలకై వెచ్చించండం మంచిది. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. అనుభూతి గొప్పగా ఉంటుంది. పరామర్శలు ఉండే సూచనలు జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కుంభం : (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అన్ని పనుల్లో లాభాలు ఉంటాయి. పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. సామాజిక అనుకూలత ఏర్పడుతుంది. సంతృప్తి లభిస్తుంది. అధికారులతో అనుకూలత ఉంటుంది. శ్రీ మాత్రే నమః జపం మంచిది.

మీనం : (పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : వృత్తిలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఉద్యోగంలో శ్రమ ఉంటుంది. అధికారులతో అప్రమత్తత అవసరం. పెద్దలంటే గౌరవమర్యాదలు. అధికారులతో అప్రమత్తత అవసరం. సంఘంలో గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సామాజిక అభివృద్ధి ఉంటుంది. శ్రీ రాజమాతంగ్యై నమః జపం మంచిది.