26మే 2019 ఆదివారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సోదర వర్గీయుల సహకారం పెరుగుతుంది. పరాక్రమం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. ప్రచార ప్రసార సాధనాలు సంతృప్తినిస్తాయి. సౌకర్యాల వల్ల ఆనందిస్తారు. ప్రయాణాల్లో అనుకూలతు పెరుగుతాయి. సౌకర్యాలు లభిస్తాయి. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వాగ్దానాలు ఒత్తిడి తెస్తాయి. మాటవిలువ తగ్గుతుంది. కుటుంబంలో అసౌకర్యాలు ఏర్పడతాయి. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. సౌకర్యాల వల్ల మానసిక ప్రశాంతతను కోల్పోతారు. నిల్వ ధనం తగ్గించే ప్రయత్నాలు జరుగుతాయి. శ్రీమాత్రేనమః జపం మంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పనుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం లభించదు. అన్ని విషయాల్లో లోపాలు కనిపిస్తాయి. గుర్తింపుకోసం ఆరాట పడతారు. విచారం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత పెంచుకోవాలి. శ్రీమాత్రేనమః జపం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : విశ్రాంతికోసం ఎదురు చూపులు ఉంటా యి. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. అధికారులతో జాగ్రత్త అవసరం. అనవసర కష్టాలు వచ్చే సూచనలు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ప్రమాద సూచనలు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. ఇతరులపై ఆధారపడతారు. శ్రీమాత్రేనమః.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. ఒత్తిడి అనంతరం సంతోషం లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సమిష్టి ఆశయాలు నెరవేరుస్తాయి. ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది. సోదర వర్గీయుల ద్వారా అభివృద్ధి చేకూరుతుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం ఉపయోగపడుతుంది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అధికారులతో అనుకూలత పెరుగుతుంది. అన్ని పనుల్లో జయం వస్తుంది. రాజకార్యాలపై ఆసక్తి పెరుగుతుంది. చేసే ఉద్యోగంలో సంతోషం పెరుగుతుంది. ఆనందకర వాతావరణం. సంఘం గౌరవం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలపై ఆసక్తి ఉంటుంది. శ్రీమాత్రేనమః జపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పరిశోధనల వల్లఒత్తిడి ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన. విందుభోజనాలపై ఆసక్తిని పెంచుతుంది. గౌరవ హాని జరుగుతుంది. న్యాయ అన్యాయ విచారణ చేస్తారు. పరాక్రమం ఉంటుంది. సంతృప్తి లోపం ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం ఉపయోగపడుతుంది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అనారోగ్య సమస్యలు. ఆపరేషన్స్ వాయిదా వేసుకోవడం మంచిది. సౌకర్యాలు ఒత్తిడికి గురిచేస్తాయి. ఇతరులపై ఆధారపడతారు. వ్యాపారస్తులకు ఒత్తిడి సమయం. ఆకస్మిక ప్రమాదాలు జరిగ సూచనలు. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన మంచి చేస్తుంది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సామాజిక అనుబంధాలు తగ్గుతాయి. భాగస్వామ్య ఒప్పందాలు కోల్పోయే సూచనలు. నూతన పరిచయాలు అననుకూలత. సంంఘంలో గౌరవం కోసం ఆరాట పడతారు. పరస్పర సహకారాలు కోల్పోతారు. చేప్టిన పనుల్లో ఒత్తిడి ఉంటుంది. మధ్యలో ఆపే సూచనలు. శ్రీమాత్రేనమః జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : పోీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. గుర్తింపు లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. అప్పులు కొంత వరకు తగ్గే సూచనలు ఉంటా యి. రోగ నిరోధక శక్తి పెంచుకునే ప్రయత్నం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సృజనాత్మకతను కోల్పోతారు. శత్రువుల వల్ల ఒత్తిడి పెంచుకుటారు. మానసిక ఒత్తిడి అధికం. సంతాన సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు అధిక శ్రమ ఉంటుంది. పరిపాలన సమర్ధత తగ్గుతుంది. ఆత్మీయులు దూరమయ్యే సూచనలు. సుబ్రహ్మణ్యారాధన మేలు చేస్తుంది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. వామనాల వల్ల ప్రమాదాలు. విందుభోజనాలపై దృష్టి. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. మాతృ వర్గీయులతో మాట ప్టింపు తగ్గించుకోవాలి. హనుమాన్ చాలీసా, హనుమత్ ప్రదక్షిణలు మంచివి.
డా.ఎస్.ప్రతిభ