మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పరిశోధకులకు ఒత్తిడితో కూడిన సమయం ఉంటుంది. అనవసర ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. సంతృప్తి తగ్గుతుంది. గణపతి ఆరాధన, పశువులకు, పకక్షులకు నీరు పెట్టడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. అనారోగ్య భావన ఏర్పడుతుంది. చెడు మార్గాలపై దృష్టి పెడతారు. కాలయాపన ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పరాధీనం ఉంటుంది. గణపతి ఆరాధన, పశువులకు, పకక్షులకు నీరు పెట్టడం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వ్యాపారస్తులు అప్రమత్తతో ఉండాల్సిన సమయం. పనుల్లో ఒత్తిడులు అధికంగా ఉంటాయి. పదిమందితో కలిసినప్పుడు జాగ్రత్త అవసరం. నూతన పరిచయాలు పెంచుకోకూడదు. భాగస్వాములవల్ల ఇబ్బందులు. సామాజిక అభివృద్ధితగ్గుతుంది. గణపతి ఆరాధన, పశువులకు, పకక్షులకు నీరు పెట్టడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శత్రువులపై విజయకాంక్ష పెరుగుతుంది. పోటీల్లో ఒత్తిడితో గెలుపు సాధిస్తారు. శ్రమాధిక్యం గుర్తింపు ఉంటుంది. పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఋణ ఆలోచనలు తగ్గించే ప్రయత్నం చేస్తారు. పశువులకు, పకక్షులకు నీరు పెట్టడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సంతాన సమస్యలు ఒత్తిడికి గురిచేస్తాయి. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. సృజనాత్మకత తగ్గుతుంది. అనవసర ఇబ్బందులు వచ్చే సూచనలు. అనవసర ఖర్చులు పెడతారు. దానధర్మాలు అవసరం. గణపతి ఆరాధన, పశువులకు, పకక్షులకు నీరు పెట్టడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. గృహంలో అనుకోని ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. జాగ్రత్త అవసరం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆహారంలో సమయపాలన అవసరం.అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు.గణపతిఆరాధన,పశువులకు, పకక్షులకు నీరు పెట్టాలి.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పరిచయంలేని వ్యక్తులతో అనుకూలత ఏర్పడుతుంది. పనులు పూర్తి చేస్తారు. పనుల్లో కొంత నిరాశ, నిస్పృహలు ఉంటాయి.ప్రచార, ప్రసార సాధనాలవల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. సహకారాలులాభిస్తాయి. దగ్గరి ప్రయాణాలు. విద్యార్థులకుఅనుకూలసమయం.గణపవాగ్దానాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మాట విలువ తగ్గుతుంది. కుటుంబంలో అనవసర ఒత్తిడి, చికాకులు ఏర్పడే సూచనలు ఉంటాయి. కంటి సంబంధ లోపాలు ఏర్పడే సూచనలు ఉంటాయి. అనవసర ఖర్చులు ఉంటాయి. జాగ్రత్త అవసరం. పశువులకు, పకక్షులకు నీరు పెట్టడం మంచిది.నిత్యావసర

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : చేసే పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. మానసిక ఆందోళన అధికం అవుతుంది. తెలియని భయం ఉంటుంది. ప్రణాళికలు జాగ్రత్తగా అమలు చేయాలి. గణపతి ఆరాధన, పశువులకు, పకక్షులకు నీరు పెట్టడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేస్తారు. సమయం దుర్వినియోగం అవుతుంది. ధనం వృథాఅవుతుంది. శ్రమను వినియోగించి నష్టపోయే సూచనలు ఉంటాయి. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. గణపతి ఆరాధన, పశువులకు, పకక్షులకు నీరు పెట్టడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. అనుకున్న పనులు శ్రమతో పూర్తిచేస్తారు. కాలాన్ని వినియోగించే ప్రయత్నం చేస్తారు. దాన ధర్మాలు చేసే ఆలోచన ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మానసికప్రశాంతతకై ఆలోచిస్తారు. ఏదైనాకోల్పోయే సూచన ఉంటుంది.పశువులకు,నీరు పెట్టడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సంఘంలో గౌరవ హాని ఉంటుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనవసర ఖర్చులు చేస్తారు. కాలం దుర్వినియోగం అవుతుంది. శ్రమ రాహిత్యం అధికంగా ఉంటుంది. అనవసర ఖర్చులు ఉంటాయి. కీర్తిప్రతిష్టలు తగ్గిపోయే సూచనలు ఉంటాయి. పశువులకు, పకక్షులకు నీరు పెట్టడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ