27 జులై, 2018 శుక్రవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today july27th your horoscope

మేషం

మేషం : ఈ రోజు వ్యాపారంలో, మీరు చేపట్టిన పనుల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. మీ ప్రతిభను చూపించాల్సిన సమయమిది. కొత్తవారితో పరిచయాలకు, స్నేహాలకు అనుకూలమైన రోజు. ఇతరుల ప్రభావానికి, ఒత్తిడికి లోనుకాకండి. దాని కారణంగా అనవసర సమస్యలు ఏర్పడతాయి.

వృషభం

వృషభం : ఈ రోజు కొత్త వారితో పరిచయం కానీ లేదా విదేశీయానానికి సంబంధించి ముఖ్య సమాచారం అందుకుంటారు. మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. ఏదో తెలియని భయాన్ని అనుభవిస్తారు. మీ తండ్రిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులు వస్తాయి.

మిథునం

మిథునం : ఈ రోజు ప్రతి పనిలో, రోజువారి జీవితంలో ఏదో ఒక ఇబ్బందిని, అడ్డంకులను ఎదుర్కొంటారు. గొడవలు, అవమానికి గురవడం లేదా వివాదాల్లో ఇరుక్కోవడం జరగవచ్చు. మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా పనులు చేస్తే విజయం వరిస్తుంది. పెట్టుబడులకు అనుకూలం కాదు. ఖర్చులు అధికంగా ఉంటాయి.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మీ మిత్రులను కలుసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధనలాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు.

సింహం

సింహం : ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీలు, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు.

కన్య

కన్య : ఈ రోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవడం లేదా అనుకోని అడ్డంకులు రావడం వల్ల మానసికంగా చికాకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్యకొంత తగ్గుతుంది. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూలమైన రోజు కాదు.

తుల

తుల : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉద ర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు మీ మనస్సు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవడం జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాటతీరు కానీ, వ్యవహారశైలి ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి. దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు.

మకరం

మకరం : ఈ రోజు మీస్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఎక్కువ సేపు ఇంటిలో ఉండాలని, కుటుంబసభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.

కుంభం

కుంభం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి.

మీనం

మీనం : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios