Asianet News TeluguAsianet News Telugu

జులై 18, 2018 బుధవారం మీ రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today july18th your horoscope

మేషం

మేషం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామికి కానీ, మీరు ప్రేమించిన వ్యక్తిని కానీ మీ ప్రేమను వ్యక్త పరుస్తారు. అలాగే వివాహ సంబంధాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. ప్రయాణాలకు అనుకూల దినం.

వృషభం

వృషభం : ఈ రోజు ఆర్థికంగా బాగుటుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. కోర్టు కేసుల్లో కానీ విజయం సాధిస్తారు. అలాగే స్నేహితుల నుంచి అనుకోని సాయం అందుతుంది. ఆర్థిక సాయం కోరకు ఎదురుచూస్తున్న వారికి ఈ రోజు అనుకూల ఫలితం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మిథునం

మిథునం : ఈ రోజు మీరు ఇష్టపడిన వారికి మీ ప్రేమను వ్యక్తం చేయటానికి, స్నేహితులతో ఉన్న వివాదాలను తొలగించుకోటానికి అనుకూల దినం. మిత్రుల నుంచి సహాయం ఆశిస్తున్నవారికి సాయం అందుతుంది. మీ పిల్లలకు సంబంధించి ఉన్నత విద్యావకాశాలు మెరుగవుతాయి.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు పని మీద ఎక్కువగా ధ్యాస ఉండదు. కుటుంబ సభ్యులతో గడపాలి అనే ఆలోచన అధికంగా ఉంటుంది. విద్యా సంబంధ వ్యవహారాలకు, భూ, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం. భూమి లేదా వాహనం కొనుగోలు చేయదలచిన వారు ఈ రోజు తీసుకోవచ్చు.

సింహం

సింహం :ఈ రోజు వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది.అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటం మంచిది. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ ఉంటుంది.

కన్య

కన్య : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం, లేనిచో అవమానాల పాలవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనటం కాని, బాగు చేయించటం కానీ చేస్తారు.

తుల

తుల : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవటం కానీ, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయటం కానీ చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది.

ధనుస్సు

ధనుస్సు :ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.

మకరం

మకరం : ఈ రోజు మీరు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. పనికి గుర్తింపు లభిస్తుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని, గుర్తింపును పొందుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

కుంభం

కుంభం :ఈ రోజు మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. అనుకోని ప్రయాణం కానీ, కొత్త వ్యక్తులను కలుసుకోవటం కానీ జరుగుతుంది. మానసికంగా ఏదో తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మార్పు కోరుకుంటారు.

మీనం

మీనం : ఈ రోజు మానసికంగా కొంత అశాంతితో ఉంటారు. అనుకోని అవమానం కానీ, భయం కానీ ఎదురవుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళనకు కారణం అవొచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. అనుకోని విషయాలపై ఖర్చు చేయాల్సి వస్తుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది.

Follow Us:
Download App:
  • android
  • ios