Asianet News TeluguAsianet News Telugu

today horoscope: 09 జనవరి 2021 శనివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి కొత్త పరిచయాలు. వ్యాపారాలలో  మరింత అనుకూలం.  ఉద్యోగాలలో  పదోన్నతి సూచనలు. 

today dinaphalithalu 9th january 2021
Author
Hyderabad, First Published Jan 9, 2021, 7:13 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 9th january 2021

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు కార్యజయం. మిత్రులతో  ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాలు తీరతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. వ్యాపారాలలో  మరింత అనుకూలం.  ఉద్యోగాలలో  పదోన్నతి సూచనలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. ఆశ్చర్యకరమైన సంçఘటనలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాల సందర్శనం. కొత్త వ్యాపారాలకు శ్రీకారం. ఉద్యోగాలలో  అనుకోని మార్పులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు  కొత్త రుణయత్నాలు.  ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కొన్ని సమస్యల చికాకు పరుస్తాయి. కార్యక్రమాలలో అవరోధాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో అంతగా లాభాలు కనిపించవు. ఉద్యోగాలలో  ఆకస్మిక బదిలీలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు కార్యక్రమాలలో అవాంతరాలు.  ప్రయాణాలు వాయిదా. మిత్రులతో విభేదాలు. రాబడి నిరాశ కలిగిస్తుంది. ఆలయాల దర్శనాలు. వ్యాపారాలలో  ఒత్తిళ్లు.  ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు మీ ఆశయాలు నెరవేరతాయి. పనులలో  విజయం. ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు.  వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు రాగలదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ముఖ్య కార్యక్రమాలలో ఆటంకాలు. కష్టించినా ఫలితం కనిపించదు.  బంధువర్గం నుంచి ఒత్తిడులు. రాబడి కొంత తగ్గుతుంది. వ్యాపారాలలో  ఒడిదుడుకులు. ఉద్యోగాలలో  పనిఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు యత్నకార్యసిద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి.  వ్యాపారాలలో  లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. వాహనయోగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు ఆదాయానికి మించిన ఖర్చులు. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో  గందరగోళం. ఉద్యోగాలలో  అదనపు బాధ్యతలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు నూతన ఉద్యోగాలు. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు.  ఆకస్మిక ధనలాభ సూచనలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో  చికాకులు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు  రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు. ఉద్యో ఉన్నత స్థితి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. శారీరక  రుగ్మతలు. బంధువర్గంతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా. వ్యాపారాలలో  చిక్కులు. ఉద్యోగాలలో  ఆటంకాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు కార్యక్రమాల్లో అవరోధాలు. రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగాలలో  చిక్కులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

  

Follow Us:
Download App:
  • android
  • ios