Asianet News TeluguAsianet News Telugu

08 జూన్ 2021: ఈ రోజు మీ జాతకం ఎలా ఉందంటే..!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆరోగ్యభంగం.  

today dinaphalithalu 8th june 2021
Author
Hyderabad, First Published Jun 8, 2021, 7:13 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 8th june 2021

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. సన్నిహితుల నుంచి సహాయం. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ఆకస్మిక ధన,వస్తులాభాలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆర్థిక ప్రగతి. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా పూర్తి. ఉద్యోగులకు పదోన్నతులు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. పాతమిత్రులను కలుసుకుంటారు. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ప్రయాణాలు. రుణయత్నాలు. పనులలోజాప్యం. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. దైవచింతన. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు  పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు  పాతమిత్రుల కలయిక. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆసక్తికరమైన సమాచారం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనులు మందగిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. వ్యాపారాలు మందగిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు కుటుంబంలో చికాకులు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఉద్యోగాలు, వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు  పనులలో విజయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. దైవదర్శనాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఉద్యోగులకు అదనపు పనిభారం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. సోదరుల కలయిక. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios