Asianet News TeluguAsianet News Telugu

today astrology: 07 జులై 2021 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ రోజు మిత్రుల సహకారం అందుతుంది. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. 

today dinaphalithalu 7th july 2021
Author
Hyderabad, First Published Jul 7, 2021, 7:05 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు మిత్రులతో విభేదాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. పనుల్లో జాప్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొమ్ము అందక ఇబ్బందులు. వృత్తి,వ్యాపారాలు సామాన్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు మిత్రుల సహకారం అందుతుంది. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు ఉద్యోగ యత్నాలు నత్తనడకన సాగుతాయి. పనులు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. బాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు  నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. ఇంటిలో శుభకార్యాలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. రుణయత్నాలు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. విద్యార్థులకు ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. బంధువులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు. ఆర్థిక ప్రగతి. రుణఒత్తిడులు తొలగుతాయి. వస్తులాభాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు బంధువుల నుంచి ఒత్తిడులు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆస్తి వివాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios