Asianet News TeluguAsianet News Telugu

today astrology: 06 ఆగస్టు 2020 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి అధికంగా లాభం వచ్చే స్వల్పకాలిక వ్యాపారాల్లో ధనాన్ని మదుపు చేస్తారు. స్పెక్యులేషన్ లాభసాటిగా ఉంటుంది. శుభఫలితాలున్నాయి. సమీప బంధువులను కలుస్తారు.

today dinaphalithalu 6th august 2020 horoscope
Author
Hyderabad, First Published Aug 6, 2020, 7:07 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 6th august 2020 horoscope

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకాలం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. వ్యక్తిగత విషయాలకు ప్రాముఖ్యతనిస్తారు. కొనుగోలుకు అధికంగా ఖర్చు చేస్తారు.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు అధికంగా లాభం వచ్చే స్వల్పకాలిక వ్యాపారాల్లో ధనాన్ని మదుపు చేస్తారు. స్పెక్యులేషన్ లాభసాటిగా ఉంటుంది. శుభఫలితాలున్నాయి. సమీప బంధువులను కలుస్తారు. భవిష్య ప్రణాళికల గురించి చర్చించి, బుద్ధిబలం బాగుంటుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు సంఘసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో మిశ్రమ వాతావరణం సూచితం. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామి సహాయ సాకారాలు అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. అనుకూలమైన వాతావరణం నూతనోత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యతనివ్వండి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. మోగాభ్యాసం ప్రకృతి వైద్యం ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. గృహసంబంధిత ఖర్చులు అధికమవుతాయి.  ఓ శుభవార్త మీలో ధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు వ్యాపారంలో రొటేషన్ లాభాలు బాగుంటాయి. విలువైన వస్తువుల భద్రత పట్ల అప్రమత్తత వహించండి. కుటుంబంలో ఐక్యమత్యత మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వాహనయోగ సూచన ఉంది. శరీర సౌఖ్యం కలగదు. మనసు చెప్పింది చేయండి. శుభం చేకూరుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు కుటుంబ అభివృద్ధికి సంబంధించి శుభవార్త వింటారు. అవసరానికి సహాయం చేసేవారున్నారు. ప్రజాసంబంధాలను బలపరచుకోవడానికి మరింత శ్రమిస్తారు. అనుకూల ఫలితాలను సాధిస్తారు. గతంలో చేజారిన అవకాశాలు ఇప్పుడు అందివస్తాయి. శుభపరంగా ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు గతంలో నిర్లక్ష్యం చేసిన అంశాలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. కొనుగోలు అమ్మకాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆరోగ్య సూత్రాలు క్రమ పద్ధతిలో అమలుపరచాలని నిర్ణయించుకుంటారు. వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటివారి సహకారం ఉంటుంది. గృహోపకరణ సామాగ్రిని సమకూర్చుకుంటారు. బంధువులు, శ్రేయోభిలాషులతో ఇష్టాగోష్టి సాగిస్తారు. అనుకూలమైన వాతావరణంలో ఆనందంగా కాలం గడుపుతారు. ధార్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు అధికారులను మెప్పించడానికి శ్రమ అధికమవుతుంది. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. సంతాన విద్యా వియ వ్యవహారాల పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. శ్రమకు ఓర్చి కార్యక్రమాలను విజయపథంలో నడిపిస్తారు. చేపట్టే పనుల్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు ముఖ్య బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. ఉన్నత పదవీ లాభాలున్నాయి. స్థిర నిర్ణయాలతో శుభం చేకూరుతుంది. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. అన్ని విషయాల్లో భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు తలపెట్టిన పనులను తోటివారి సహకారంతో చక్కపెడతారు. కలహాలు వచ్చే అవకాశముంది. బంధువల ద్వారా ధన, వస్తు లాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios