Asianet News TeluguAsianet News Telugu

today horoscope: 4 డిసెంబర్ 2020 శుక్రవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు.  ఆకస్మిక ప్రయాణాలు. . రాబడి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారులకు లాభాలు అంతగా కనిపించవు.

today dinaphalithalu 4th december 2020
Author
Hyderabad, First Published Dec 4, 2020, 7:06 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 4th december 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు కొత్త కార్యక్రమాలు చేపడతారు.  పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. నూతన అగ్రిమెంట్లు  చేసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశాలు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు.  ఆకస్మిక ప్రయాణాలు. . రాబడి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారులకు లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులకు  పనిభారం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు కార్యజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం.మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. భూములు, గృహం కొంటారు. వ్యాపారులకు లాభాలుు. ఉద్యోగులకు కొత్త ఆశలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు కొన్ని కార్యక్రమాలను వాయిదా.  పాతమిత్రులను కలుసుకుంటారు.  నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారులకు లాభాలు కష్టమే. ఉద్యోగులకు మరింతగా ఒత్తిళ్లు. దైవదర్శనాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి.  ఆదాయం ఉత్సాహాన్నిస్తుంది. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆశించిన కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలలో అధిక లాభాలు.  ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు కార్యక్రమాలలో అవాంతరాలు.  ఆరోగ్యభంగం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు. బంధువుల నుంచి విమర్శలు. వ్యాపారాలలో  ఇబ్బందులు. ఉద్యోగాలలో నిరుత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు ఆదాయానికి మించిన ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో సామాన్యస్థితి. ఉద్యోగాలలో ఆటంకాలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు వాహన, గృహయోగాలు. అనుకున్న పనుల్లో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. ఆలయ దర్శనాలు. బంధువులతో చర్చలు.  ధనలాభం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ఆదాయం పెరుగుతుంది. బంధువుల కలయిక. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. రావలసిన సొమ్ము అందుతుంది. విద్యార్థుల ప్రయత్నాలు సఫలం. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగాలలో ఉత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు ఆదాయం నిరాశ పరుస్తుంది. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్యభంగం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో గందరగోళం.  ఉద్యోగాలలో పనిభారం. దైవదర్శనాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు.  ఆదాయం కాస్త తగ్గుతుంది. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios