Asianet News TeluguAsianet News Telugu

today astrology: 04 ఆగస్టు 2020 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ రోజు చేపట్టిన కార్యం జయం అవుతుంది. ఇతరులను మెప్పించి పనులు సానుకూల పరచుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఒక ఆహ్వనానికి, ప్రకటనకు లేదా ఉత్తరానికి ప్రతిస్పందిస్తారు. 

today dinaphalithalu 4th august 2020
Author
Hyderabad, First Published Aug 4, 2020, 7:17 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 4th august 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు  ప్రయాణాలు అనుకూలంగా మారుతాయి. శుభవార్త శ్రవణం చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధ విషయాలు అనుకూలంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు చేపట్టిన కార్యం జయం అవుతుంది. ఇతరులను మెప్పించి పనులు సానుకూల పరచుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఒక ఆహ్వనానికి, ప్రకటనకు లేదా ఉత్తరానికి ప్రతిస్పందిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు ఆకారణంగా మిత్రుడితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. విపరీతమైన పని ఒత్తిడి ఆరోగ్యాన్ని చెడగొట్టవచ్చు.  దైవానుగ్రహం అన్ని వేళలా అండగా ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు ధైర్యంతో తీసుకున్న ఒక నిర్ణయం సరికొత్త మలుపునకు దారి తీస్తుంది. కనిపించని కృతజ్ఞత కొరకు ఎదురు చూసి నిరాశ పడతారు. ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఆలయాలను సందర్శిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు కుటుంబ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. తెలివితేటలకు, పరిజ్ఞానానికి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారానికి, ఉద్యోగానికి సంబంధించిన ఉపయోగకరమైన సమాచారాన్ని అందుకుంటారు.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు సంస్థలోని సహచరుల సౌజన్యంతో కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు తనం ఇబ్బందులకు గురి చేసే నూచనలు ఉన్నాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు మీ తెలివితేటలు, నైవుణ్యం ప్రదర్శించడానికి వచ్చిన చక్కని అవకాశాన్ని నేర్పుగా ఉపయోగించుకోవాలి. కొనుగోలు, అమ్మకాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు రహస్య శత్రువులు వెలుగులోకి వస్తారు. ప్రశాంతంగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా లాభపడతారు. నరఘోష అధికంగా ఉంటుంది. శుభవార్తా శ్రవణం చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు ఆర్థిక వ్యవహారాలలో లోటు పాట్లు తప్పక పోవచ్చు. ఇతరుల వ్యవహారాలు, వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. నీలాప నిందలకు తావు లేకుండా ఉండటానికి ఈ సూచన. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో నూతనోత్సాహంతో శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. సాంకేతిక లోపం వల్ల అందాల్సిన సమాచారం సకాలంలో చేరకపోవచ్చు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు వృత్తి సబంధమైన అభివృద్ధిలో ఆటంకాలు తొలగిపోతాయి. గృహ సమస్యల నుంచి బయటపడతారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. వెన్నునొప్పి బాధించే సూచనలు ఉన్నాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్ధికంగా ఒడిదొడుకులు తొలగిపోతాయి. ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఎదురుచూడని అవకాశాలను నేర్పుగా ఉపయోగించుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios