Asianet News TeluguAsianet News Telugu

today astrology:03 ఆగస్టు 2020 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. కోపతాపాలకు దూరంగా ఉండటం ఉత్తమం

today dinaphalithalu 3rd august 2020
Author
Hyderabad, First Published Aug 3, 2020, 7:13 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 3rd august 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు కొత్త విషయాలను తెలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. వివాహ ప్రయత్నాలు కొంత మేర అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. మీ నైపుణ్యం, ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు గృహ నిర్మాణ ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరుల నుంచి నహాయ సహకారాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. కోపతాపాలకు దూరంగా ఉండటం ఉత్తమం. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు ముఖ్యమైన నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు బంధువులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. శుభకార్యాలు, విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యలు కొంత వరకు తీరుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయసహకారాలు అందుతాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిన్తుంది. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి, వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువులతో కలిసి ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాలు, విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. చేపట్టిన పనులు చకచకగా పూర్తి చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక రుణాలు కొంత వరకు తీరుస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. బాధ్యతలు మరింత పెరిగినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఇంటా, బయటా అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. సోదరుల నుంచి ఆస్తి లాభం పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ముఖ్యమైన వ్యవహరాలలో విజయం సాధిస్తారు. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. శ్రమకు తగిన ఫలితం కష్టమే. ఉద్యోగాలలో స్థానచలనం ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios