Asianet News TeluguAsianet News Telugu

today astrology:30 జులై 2020 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఇతరులతో మాట్లాడేటప్పుడు తొందరపాటు తనం ఇబ్బందులక గురి చేసే సూచనలు ఉన్నాయి. కార్యాలయం, పరిచేసే సంస్థలో సహచరుల సౌజన్యంతో కలిసి కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు

today dinaphalithalu  30th july 2020
Author
Hyderabad, First Published Jul 30, 2020, 7:17 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu  30th july 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు  దూర ప్రయాణం అనుకూలంగా మరుతుంది. శుభవార్త శ్రవణం చేస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపార సంబంధ విషయాలు అనుకూలంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు చేపట్టిన కార్యక్రమాలు, తలపెట్టిన కార్యం జయం అవుతుంది. మాటతీరుతో ఇతరులను మెప్పించి పనులు సానుకూల పరచుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఒక ఆహ్వానానికి, ప్రకటనకు లేదా ఉత్తరానికి ప్రతిస్పందిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు ఆకారణంగా మిత్రులతో విభేదాలు రాకుండా ముందు జాగ్రత్త వహించాలి. విపరీతమైన పని ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దైవానుగ్రహం అన్ని వేళలా అండగా ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ధైర్యంతో తీసుకున్న ఒక నిర్ణయం సరికొత్త మలుపునకు దారి తీస్తుంది. కనిపించని కృతజ్ఞత కోసం ఎదురు చూసి నిరాశ పడతారు. దైవ దర్శనం చేసుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు కుటుంబ బాధ్యతలు నమర్ధవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారానికి, ఉద్యోగానికి సంబంధించిన ఒక ఉపయోగకరమైన సమాచారాన్ని అందుకుంటారు. తెలివితేటలు, పరిజ్ఞానానికి ప్రశంసలు లభిస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు ఇతరులతో మాట్లాడేటప్పుడు తొందరపాటు తనం ఇబ్బందులక గురి చేసే సూచనలు ఉన్నాయి. కార్యాలయం, పరిచేసే సంస్థలో సహచరుల సౌజన్యంతో కలిసి కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు విలువైన వస్తువుల కొనుగోలు, అమ్మకాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తెలివితేటలు, నైపుణ్యం ప్రదర్శించటానికి వచ్చిన చక్కని అవకాశాన్ని నేర్పుగా ఉపయోగించుకుని లబ్ది పొందుతారు.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు రహస్య శత్రువులు వెలుగులోకి వస్తారు. నరఘోష అధికంగా ఉంటుంది. శుభవార్త శ్రవణం చేస్తారు. ప్రశాంతంగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా లాభపడతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు ఆర్థిక సంబంధ వ్యవహారాలలో లోటుపాట్లు తప్పక పోవచ్చు. వివాదాలు, విభేదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. లేకపోతే ఇబ్బందులు కోరి తెచ్చుకుంటారు. నిందలకు తావు లేకుండా ఉండటానికి ఈ సూచన పాటించడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు సాంకేతిక లోపాల వల్ల అందవలసిన సమాచారం సకాలంలో చేరకపోవచ్చు. కార్యాలయంలో నూతనోత్సాహంతో శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. గోశాలలో గరికదానం చేయండి. శుభం జరుగుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు స్నేహ బంధాలు మరింత బలపడతాయి. వృత్తి సంబంధమైన అభివృద్ధిలో ఆటంకాలు తొలగిపోతాయి. గృహ సమస్యల నుంచి బయటపడతారు. వెన్నునొప్పి బాధించే నూచనలు ఉన్నాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు ఆర్థిక విషయాలలో ఒడిదొడుకులు తొలగిపోతాయి. ఇంటర్వులలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఎదురుచూడని అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని నేర్పుగా ఉపయోగించుకోవడం ఉత్తమం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios